»   » మణిరత్నానికి మొత్తానికి హీరో దొరికాడు

మణిరత్నానికి మొత్తానికి హీరో దొరికాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : ఓకే బంగారం (‘ఓ కాదల్‌ కన్మణి') తర్వాత ప్రముఖ దర్శకుడు మణిరత్నం సినిమా ఒక్కటీ పట్టాలు ఎక్కలేదు. ఆయన దర్శకత్వంలోని సినిమాపై పలురకాల వార్తలు వినిపించాయి. కొంతకాలం ఆయన దర్శకత్వంలో మరోసారి విక్రమ్ నటిస్తున్నట్లు చెప్పుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టు డ్రాప్‌ అయిందని.. మళ్లీ దుల్కర్‌, నానిలతో కలిసి ఓ సినిమాను రూపొందిస్తున్నారని కూడా ప్రచారం సాగింది.

మరోవైపు తమిళం, తెలుగును పక్కనబెట్టి హిందీ సినిమాను దర్శకత్వం వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. ఇప్పుడు మణిరత్నం దర్శకత్వంలో కార్తి హీరోగా నటిస్తున్నారని తమిళ సినీ వర్గాలు అంటున్నాయి. ఈ విషయం దాదాపు ఖరారైందని చెబుతున్నాయి.

Maniratnam next with Karthi?

మణిరత్నం కోసం కార్తి ఏప్రిల్‌ నుంచి కాల్షీట్‌లు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో నిత్యామీనన్‌ హీరోగా నటించే అవకాశాలున్నాయి. షూటింగ్ ఏప్రిల్‌ ఆరంభంలో ఉంటుందని సన్నిహిత వర్గాల సమాచారం.

ప్రస్తుతం కార్తీ తెలుగు,తమిళ భాషల్లో ఊపిరి అనే చిత్రం చేస్తున్నారు. నాగార్జున మరో కీలకమైన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. పివిపి వారు ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.

English summary
Rumours are that Mani Ratnam has signed tamil hero Karthi and Nitya menon for his upcoming movie.
Please Wait while comments are loading...