For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Manjima Mohan యువ హీరోతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్.. మంజిమా ప్రియుడు కూడా ఎమోషనల్ పోస్టులు!

  |

  తమిళ సినిమా పరిశ్రమలో ఇటీవల కాలంలో గౌతమ్ కార్తీక్, మంజిమా మోహన్ అఫైర్ వార్తలు మీడియాలో వైరల్ అయ్యాయి. వారిద్దరి ప్రేమ వ్యవహారం ముదిరి పాకన పడిందనే విషయం దక్షిణాదిలో విస్తృతంగా ప్రచారమైంది. అయితే ఆ వార్తలకు తెర దించడమే కాకుండా తమ మ్యారేజ్ న్యూస్‌ను అధికారికంగా ప్రకటించారు. తమ పెళ్లి గురించి గౌతమ్ కార్తీక్, మంజిమా మోహన్ చేసిన పోస్టు వివరాల్లోకి వెళితే..

  మంజిమా మోహన్ అఫైర్, పెళ్లి గురించి

  మంజిమా మోహన్ అఫైర్, పెళ్లి గురించి


  గౌతమ్ కార్తీక్‌తో ప్రేమ, పెళ్లి వ్యవహారం వార్తల మధ్య మంజిమా మోహన్ తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌ను క్లీన్ చేసింది. గతంలో అందరికి అందుబాటులో ఉండే అకౌంట్‌ను కొందరికే పరిమితం చేసింది. గతంలో చేసిన పోస్టులన్నింటిని డిలీట్ చేసింది. తనను ఫాలో అయ్యేవారికే తన పోస్టులు కనిపించే విధంగా అకౌంట్‌ను పునరుద్దరించింది.

  మూడేళ్ల క్రితం అంటూ మంజిమా


  అయితే తన అఫైర్, పెళ్లి వార్తను అధికారికంగా ధృవీకరిస్తూ.. మూడేళ్ల క్రితం నన్ను గొప్పగా చూసుకొనే వ్యక్తిగా నీవు నా జీవితంలోకి ప్రవేశించడంతో నా లైఫ్‌ను నీకు అర్పించాను. జీవితం పట్ల నా ఆలోచనలు, అభిప్రాయాలను పూర్తిగా మార్చివేశాడు. ఈ రోజు నన్ను పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చి దిద్దావు. నేను ఇబ్బందిలో పడిన ప్రతీసారి నన్ను ఆదుకొన్నావు. నాలోని బలహీనతలను చూపించి నన్ను నేను సరిద్దిద్దుకునే పరిస్థితిని కల్పించావు. నీవు నాపై కురిపించే ప్రేమ వల్లే నీపై కొండంత ప్రేమను పెంచుకొన్నాను. ఇప్పుడే కాదు.. ఎప్పటికీ నా జీవితంలో అత్యంత ఇష్టమైన వ్యక్తివి నీవే అని మంజిమా మోహన్ పోస్టు పెట్టింది.

  మంజిమా మోహన్ గురించి గౌతమ్ కార్తీక్

  మంజిమా మోహన్ గురించి గౌతమ్ కార్తీక్


  ఇక మంజిమా మోహన్ గురించి గౌతమ్ కార్తీక్ ఎమోషనల్‌గా స్పందిస్తూ.. నీ జీవితంలోకి సరైన వ్యక్తి ప్రవేశిస్తే.. ఆకాశమంత ప్రేమ కనిపిస్తుంది.. కళ్లలో, హృదయంలో ప్రేమభావం నిలుస్తుందని చెబుతారు. నీవు నా పక్కన ఉన్న ప్రతీసారి నాలో చెప్పలేని ఒక ఆనందం ఉరకలు వేస్తుంది అని గౌతమ్ కార్తీక్ తన పోస్టులో పేర్కొన్నారు.

  మన ప్రేమ మరింత ధృడంగా

  మన ప్రేమ మరింత ధృడంగా


  మంజిమా మోహన్.. మన జర్నీ విభిన్నమైనది. మనమిద్దరి మధ్య అవగాహన, ఒక్కో విషయంపై మౌనంగా వాదనకు దిగడం గొప్ప అనుభూతిని కలిగించింది. అలా మన బంధం అందమైన జర్నీగా మారింది. మన బంధానికి మొదట స్నేహం అనే ట్యాగ్‌ను ఇచ్చుకొన్నాం. కానీ అది మరింత బలంగా మారి.. రోజు రోజుకు వృద్ధి చెంది.. బెస్ట్ ఫ్రెండ్ అనే స్థాయికి తీసుకెళ్లింది. మన బంధం రోజులు గడుస్తున్న కొద్ది మరింత ధృడంగా మారింది అని గౌతమ్ కార్తీక్‌ తన పోస్టులో వెల్లడించారు.

  నీతో కలిసి ఒక్కటిగా అడుగులేసే క్షణం కోసం


  మంజిమా.. నీవు నా పక్కన ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా ఎదురిస్తాను. నాతో స్పెషల్ బాండ్‌ను క్రియేట్ చేసినందుకు జీవితాంతం రుణపడి ఉంటాను. జీవిత చివరి రోజు వరకు నేను నీ ప్రమేను పొందడానికే ప్రయత్నిస్తాను. నా హృదయం అంతరాల్లో నుంచి ఐ లవ్ యూ అని చెబుతాను.నీతో కలిసి అడుగులేసే క్షణం కోసం ఆశగా చూస్తున్నాను. మనమిద్దరం ఒక్కటై కలిసి చేసే జర్నీ కోసం ఎదురు చూస్తున్నాను అని గౌతమ్ కార్తీక్ తన పోస్టులో ఎమోషనల్ స్పందించారు.

  English summary
  Tamil and Malyalam actors Manjima Mohan and Gautam Karthik expressed openly their love journey with Official Instagram posts. Three years ago when I was completely lost you came into my life like a guardian angel. You changed my perspective on life and helped me realize how blessed I am!! Every time I feel like a complete mess, you pull me up. You taught me to accept my flaws and to be myself more often.And the best thing I love about you is how much you love me for who I am! You are and will always be my favorite everything.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X