twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మన్మధబాణం దెబ్బకి ఇండియాలోని అమ్మాయిలు అందరూ పడిపోతారు..

    By Nageswara Rao
    |

    ప్రపంచ కధానాయకుడు పద్మశ్రీ కమల్ హాసన్, త్రిష జంటగా కెయస్ రవికుమార్ దర్శకత్వంలో ఉదయనిధి స్టాలిన్ తమిళంలో నిర్మించిన 'మన్మధన్ అంబు' చిత్రాన్ని 'మన్మధబాణం' గా లక్ష్మిగణపతి పిల్మ్స్ వారు తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ ఇటీవల హైదరాబాద్ లోని తాజ్ బంజారా హొటల్ లో ఘనంగా జరిగింది. కమల్ హసన్ ఈసినిమా ఆడియోని విడుదల చేసి స్టేజిమీదున్నటువంటి మాధవన్, సంగీత మొదలగువారికి అందించారు.

    ఈ సందర్బంలో పద్మశ్రీ కమల్ హాసన్ మాట్లాడుతూ 'ఎంతో చిన్నది జీవితం... ఇంకా చిన్నది యవ్వనం' అనే పాటకు డాన్స్ అసిస్టెంట్ గా పనిచేసాను ఇదే హైదరాబాద్ లో. ఇప్పుడు ఈ స్టేజి కి వచ్చాను. నా ఎదుగుదల వెనుక ఎందరో మహనీయుల శ్రమ దాగుంది. వారందరికి ధన్యవాదములు. సంగీత పరంగా ఈ సినిమా ఓ అద్భుతం. ఈ ఆడియో లో ఎన్నో ప్రయోగాలూ చేసారు దేవిశ్రీప్రసాద్. నాతో రెండు పాటలు కూడా పాడించారు. సినిమా చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేశాను' అని అన్నారు. ఇదే సందర్భంలో తమిళనాడు ఉపముఖ్యమంత్రి కోడుకు ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ నాకు తెలుగు పరిశ్రమతో చాలా అనుబంధం ఉందని తెలిపారు. కమల్ హాసన్ గారు నటించినటువంటి ఈసినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు.

    దర్శకుడు కెయస్ రవికుమార్ మాట్లాడుతూ 'దశావతారం' లో కమల్ పది రకాల పాత్రలు పోషించారు. ఇక దేవిశ్రీ సంగీతం ఈ సినిమాకు ఆకర్షణగా వుంటుంది'. అని చెప్పారు. మాధవన్ మాట్లాడుతూ 'కమల్ సార్ తో సరి తూగ గల నటులు ఇండియాలో లేరు. దేవిశ్రీ ఇందులో వైవిధ్యమైన సంగీతం అందించారు. ఇందులో కమల్ పాడిన 'నీలవనం..' పాట నాకు ఇష్టమైన పాట' అని తెలిపారు. కమల్ తో తెలుగులో పాడించే అదృష్టం ఈ సినిమా ద్వారా తనకు దక్కిందని, ఈ సినిమాకు పనిచేసిన వారందరికీ ఆయనే ఇన్ స్పిరేషన్ గా నిలుస్తారని, ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తయారైన సినిమా అని, తప్పక విజయాన్ని సాధిస్తుందని దేవిశ్రీ ప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేసారు. మన్మధ బాణం ఆడియోని ప్రఖ్యాత మ్యూజిక్ సంస్ద వీనస్ ద్వారా మార్కెట్ లోకి విడుదల చేస్తున్నామని తెలిపారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X