డ్రంక్ డ్రైవ్‌లో దొరికిన ప్రముఖ హీరో.. భారీగా జరిమానా!
Recommended Video

మద్యం సేవించి వాహనాన్ని నడపటం చట్టరీత్యా నేరం అని రవాణాశాఖ చేసిన పలు హెచ్చరికలను బేఖాతరు చేసిన సినీ నటుడు పోలీసులకు దొరికిపోయాడు. శుక్రవారం (జూలై 6) రాత్రి చెన్నై నూగబాకం పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ప్రముఖ దర్శకుడు భారతీరాజా కుమారుడు, ప్రముఖ నటుడు మనోజ్ కే భారతీరాజా మద్యం సేవించి దొరికిపోయారు. వివరాల్లోకి వెళితే..

నూగబాకంలో పట్టుబడిన మనోజ్
నూగబాకంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా మనోజ్ బీఎండబ్ల్యూ కారులో వచ్చారు. ఆయనకు పరీక్షలు నిర్వహించిన అనంతరం మద్యం సేవించి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

మద్యం సేవించి.. మితిమీరిన వేగంతో
నూగంబాకంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై మనోజ్ తిరిగి వస్తున్నారు. ఆ ప్రాంతంలో మేము తనిఖీలు నిర్వహిస్తుండగా, బీఎండబ్ల్యూ కారులో వచ్చారు. ఆ సమయంలో మద్యం సేవించినట్టు గుర్తించాం. అలాగే మితిమీరిన వేగంతో వెళ్లడం కూడా కెమెరాలో రికార్డైంది అని పోలీసులు తెలిపారు.

కేసు నమోదు, జరిమానా విధింపు
దాంతో బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించాం. మనోజ్‌పై సెక్షన్ 185 కింద మనోజ్‌పై కేసు నమోదు చేశారు. అలాగే రూ.2500 ఫైన్ విధించి.. కారును సీజ్ చేశారు.

తాజ్‌మహల్ ద్వారా సినీ ఎంట్రీ
మనోజ్ 1999లో ఆయన తండ్రి దర్శకత్వంలో వచ్చిన తాజ్‌మహల్ చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమ్యారు. ఇప్పటివరకు పదికిపైగా చిత్రాల్లో కనిపించారు. చివరిసారిగా ఆయన నటించిన వాయ్ మాయి చిత్రం 2016లో విడుదలైంది.

తాజాగా హీరో జై కూడా
ఇటీవల తమిళ హీరో జై పలుమార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి పోలీసుల దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఒకసారి మద్యం సేవించి దొరికిపోగా, మరోసారి కారు హారన్‌ను మోగించి పోలీసులకు చిక్కారు.


Click it and Unblock the Notifications











