For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  వారిద్దరూ కూటికోసం కష్టపడ్డారు : ఇళయరాజా

  By Srikanya
  |

  చెన్నై : 'వారిద్దరూ ఇప్పటికీ స్నేహితులుగా సంతోషంగా ఉన్నారనే విషయం నాకెంతో ఆనందంగా ఉంది. ఒకప్పుడు వారు చెన్నైలోని పాండిబజార్‌లో ఒక్కపూట కూటి కోసం కష్టపడేవారు. ఎన్నో శ్రమలను ఎదుర్కొన్నారు. ఆఖరకు చిత్ర పరిశ్రమలో స్టార్లుగా ఎదిగారు. ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నార'ని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, మోహన్‌బాబుల స్నేహం గురించి 'ఇసైజ్ఞాని' ఇళయరాజా అన్నారు.

  మంచు ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఆది, తాప్సీ, లక్ష్మీప్రసన్న నటిస్తున్న చిత్రం 'గుండెల్లో గోదారి'. ఈ సినిమా తమిళంలో 'మరందేన్‌ మన్నిత్తేన్‌' పేరిట విడుదల కానుంది. ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం నగరంలో జరిగింది. ఇందులో నటుడు మోహన్‌బాబు, సంగీత దర్శకుడు ఇళయరాజా, ఆది, విష్ణు, మనోజ్‌, తాప్సీ, లక్ష్మీప్రసన్న, కాట్రగడ్డ ప్రసాద్‌, రవిరాజా పినిశెట్టి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇళయారాజా మాట్లాడుతూ.. మూడు స్వరాలతో రూపొందించిన ఓ పాట అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు. తన జీవితంలో ఎదురైన సంఘటనలు కూడా ఈ చిత్రంలో చొప్పించడం జరిగిందని పేర్కొన్నారు.

  ప్రస్తుతం తనకు మార్కెట్‌ పెరిగిందన్న వ్యాఖ్యలపై ఇళయరాజా స్పందిస్తూ.. 'అసలు ఈ సంగీతానికి నేనే తెర. ఆ బాట వేసింది నేనే. తెరలేకుండా ఏ సినిమానూ చిత్రీకరించలేం. అలాంటి నాకు మార్కెట్‌ పెరగడం ఏంట'ని తనదైన శైలిలో వివరించారు. మోహన్‌బాబు మాట్లాడుతూ.. చిత్రరంగంలో నిలదొక్కుకోవడం కోసం ఇక్కడే అహర్నిశలు శ్రమించామని గుర్తుచేసుకున్నారు. ఈ గడ్డలోనే ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నామని చెప్పారు. తెలుగు చిత్రసీమ తనకు జీవితానిచ్చిందని తెలిపారు.

  ఆది పనిశెట్టి, తాప్సీ, మంచు లక్ష్మి, సుదీప్ కిషన్ ముఖ్య పాత్ర ధారులుగా రూపొందుతున్న చిత్రం 'గుండెల్లో గోదారి'. ఈ చిత్రం కథ గురించి హీరో ఆది పనిశెట్టి మాట్లాడుతూ -''దివిసీమ ఉప్పెనల నేపథ్యంలో సాగే కథాంశం ఇది. ఈ కథలో అంతర్లీనంగా రెండు ప్రేమకథలుంటాయి. నేను, తాప్సీ ఓ జంట అయితే... నేను, లక్ష్మీప్రసన్న మరో జంట. అందుకని ఇది ముక్కోణ ప్రేమకథకాదు. ఇద్దరితో నేను సాగించే ప్రేమాయణం ఆసక్తికరంగా ఉంటుంది'' అని హీరో ఆది చెప్పా రు.

  1986లో వచ్చిన వదరలు, ప్రేమకథను మిళితం చేసిన కథతో ఈ సినిమా రూపొందుతోంది. చిత్రంలో ప్రతి ఒక్కరు కొత్తగా కనిపించనున్నారు. ముమైత్ ఖాన్ ఐటం సాంగు చేస్తోంది. ఈ చిత్రం తమిళంలో కూడా విడుదల కానుంది. చిత్రంలో ప్రతి ఒక్కరు కొత్తగా కనిపించనున్నారు.

  English summary
  ‘Maranthen Mannithen’ ( Gundello Godari in Telugu) featuring Manchu Lakshmi, Tapsi and Aadi Pinisetty in the lead roles audio relesed. In this film aadi acts as a Fisher Man.Kumar Nagendra has directed the film and Lakshmi Manchu has produced this film which is set in the backdrop of 1986 floods in Godavari region. The film is expected to release in both Telugu and Tamil in mid November.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more