»   »  సూర్య ‘మాస్’ అఫీషియల్ టీజర్ సూపర్బ్ (వీడియో)

సూర్య ‘మాస్’ అఫీషియల్ టీజర్ సూపర్బ్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళ స్టార్ సూర్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘మాస్'. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అపీషియల్ టీజర్ విడుదలైంది. టీజర్ సూపర్బ్ గా ఉండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. మే 15న సినిమా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇదో డిఫరెంట్ జోజర్ సినిమా. ఈ సినిమాలో సూర్య సరసన నయనతార, ప్రణిత హీరోయిన్లు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి మ్యూజిక్ అందించనున్నాడు. 2డి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాని ఒకేసారి తెలుగులో కూడా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇందులో సూర్యది డబుల్ రోల్. ఇందులో సూర్య ఒక పాత్రలో హీరో క్యారెక్టర్, మరొకటి నెగిటివ్ రోల్ చేసాడని ప్రచారం సాగుతోంది. తాజాగా విడుదలై టీజర్ చూస్తే కూడా ఇదే విషయం స్పష్టం అవుతోంది. సూర్య ఈ సినిమాలో దెయ్యం లేదా, నెగిటివ్ ఫోర్స్ గా కనిపిస్తాడని అంటున్నారు. ఇక సినిమాలో యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయే విధంగా ఉంటాయిని టీజర్ స్పష్టం చేస్తోంది.

ఆ సంగతి పక్కన పెడితే ఈ సినిమాలో నయనతార నటిస్తుండటం మరో హైలెట్. గతంలో ఎక్స్ పిచ్చి వై పిచ్చి అంటూ 'గజిని'లో గ్లామర్ ను పంచిన నయన్ 'ఘటికుడు' మూవీలోనూ సూర్య సరసన నటించింది. ముచ్చటగా మూడోసారి సూర్యతో రొమాన్స్ చేస్తోంది.

English summary
Official Teaser Of "Masss" Starring Suriya,Nayanthara,Premgi Amaren and others. Music by Yuvan Shankar Raja Cinematography by Rd Rajasekar. Produced by KE Gnanavelraja.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu