»   »  రజనీ చిత్రంలో చివరికి మీనా

రజనీ చిత్రంలో చివరికి మీనా

Posted By:
Subscribe to Filmibeat Telugu

రజనీకాంత్ తాజా చిత్రం "కుశేలన్" ( తెలుగులో "కుచేలుడు")లో రెండో హీరోయిన్ పాత్రకు మీనా ఎంపికైంది. వన్ ఇండియా గతంలో రాసిన విషయం ఇప్పుడు నిజమైంది.

ఈ పాత్రకు మొదట సిమ్రాన్ పేరును పరిశీలించారు. కానీ ఆమె డి మాండ్లు అధికంగా ఉండడంతో టబు అనుకున్నారు. కానీ ఆమె చాలా కాలంగా తమిళ సినిమా రంగానికి దూరంగా ఉండడంతో చాలా మంది రజనీ సన్నిహితులు వ్యతిరేకించారు.

చివరికి ఈ పాత్ర మీనా ను వరించింది. మలయాళంలో ఈ సినిమా మాతృక అయిన సినిమాలో అద్భూతంగా నటించిన మీనా ను సూపర్ స్టార్ ఎంచుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X