»   » సెట్స్ లో కుప్పకూలిన 'ఐటమ్ బాంబ్'

సెట్స్ లో కుప్పకూలిన 'ఐటమ్ బాంబ్'

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరోయిన్ ‌గా అవకాశాల కోసం టైం వేస్ట్ చేయకుండా పూర్తిస్థాయి ఐటమ్ గర్ల్ గా మారిపోయిన మేఘనా నాయుడు మొన్నీమధ్య “పులి వేషం" అనే సినిమాలో ఒక ఐటమ్ సాంగు చేస్తోంది. అంతలో అనుకోని విధంగా ఆమె సెట్ పై ఒక్కసారిగా కుప్పకూలిపోయి అందరినీ షాక్ చేసింది. స్పీడుగా ఉండాలని ప్రత్యేకంగా సమకూర్చిన నృత్య భంగిమలు, సెట్ ప్రాపర్టీలు, విపరీతమైన చెన్నై వేడి అన్నీ కలిసి మేఘనాకి స్పృహ కోల్పోయేలా చేశాయి. అయితే డాక్టర్ ని పిలిచి, ఆయన వచ్చేలోగా ఆమే తెప్పరిల్లింది. కాస్త మంచినీళ్లు త్రాగి కాసేపు రిలాక్స్ అయిన తర్వాత ఓపిక తెచ్చుకుని ఆ పాటను పూర్తిచేసింది. ఎందుకంటే మరసటి రోజు నుంచి ఆమె వేరే షెడ్యూల్ లో బిజీ కావాలి. దాంతో కొద్దిగా తలనొప్పి అనిపించినా పేకప్ చేప్పే హీరోయిన్స్ తలుచుకుని మేఘనా గొప్పతనాన్ని ఆ యూనిట్ సభ్యులు పొగిడారు. ఇక ఇప్పటివరకు మేఘన కెరీర్ ‌లోనే ఇది అత్యంత శృంగార భరితమైన పాటగా తెరకెక్కిందని ఆ చిత్ర దర్శక నిర్మాతల చెప్పుతున్నారు. ఇక పులివేషం చిత్రాన్ని చంద్రముఖి ఫేమ్ పి.వాసు డైరక్ట్ చేస్తున్నారు. ఈ పాటని తమిళంలో సూపర్ హిట్టయిన నక్క..ముక్క ఫేమ్ శ్రీధర్ కొరియోగ్రఫి చేస్తున్నారు. శ్రీకాంత్ దేవా సంగీతం అందిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu