వ్యూస్, లైక్స్ రికార్డులన్నీ బద్దలు: టీజర్ ఎంత బావుందో...
విజయ్ త్వరలో ‘మెర్సల్’ సినిమాతో వస్తున్నాడు. తెలుగులో ‘అదిరింది’ పేరుతో ఈ చిత్రం రిలీజవ్వనుంది.
Recommended Video

తమిళస్టార్ స్టార్ విజయ్.... మన దగ్గర అతడికి పెద్దగా ఆదరణ లేదు కానీ, తమిళనాడులో రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి హీరో అతడే. అతడి సినిమా వస్తుందంటే తమిళనాట సందడి మామూలుగా ఉండదు. ప్రస్తుతం విజయ్ 'మెర్సెల్' అనే చిత్రంలో నటిస్తున్నారు.
అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ సెప్టెంబర్ 21న విడుదలైంది. ఒక్కరోజులోనే ఈ టీజర్ దాదాపు కోటి వ్యూస్ సొంతం చేసుకుంది. విజయ్ ఫాలోయింగ్ ఏ రేంజిలో ఉంటుందో చెప్పడానికి ఈ వ్యూస్ ఒక చిన్న ఉదాహరణ.

తెలుగులో ‘అదిరింది'
‘మెర్సల్' మూవీ తెలుగులో ‘అదిరింది' పేరుతో విడుదల కాబోతోంది. విజయ్ సినిమాలు దాదాపుగా అన్నీ తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తున్నా ఇక్కడ వర్కౌట్ కావడం లేదు. అయితే ఈ టీజర్ చూస్తుంటే తెలుగులో విజయ్ హిట్ కొట్టడం ఖాయం అనిపిస్తోంది.

మూడు పాత్రలు
మెర్సెల్ లో విజయ్ మూడు డిఫరెంట్ రోల్స్ లో నటిస్తున్నాడు. సమంత, కాజల్, నిత్యామేనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

రెహమాన్ మ్యూజిక్ హైలెట్
ఈ సినిమాలో రెహమాన్ మ్యూజిక్ హైలెట్ కాబోతోంది. టీజర్లో బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. ఇక సినిమాను కూడా చాలా గ్రాండ్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

శరత్ మరార్
ఈ మూవీని దీపావళి కానుకగా అక్టోబరు 18న విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని తెన్నాండల్ స్టూడియోస్ ప్రై. లిమిటెడ్ పతాకంపై మురళీ రామస్వామి, హేమా రుక్మిణి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని తెన్నాండల్ స్టూడియోస్, శరత్ మరార్‌కు చెందిన నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా విడుదల చేస్తున్నాయి.

రికార్డ్ స్థాయి వ్యూస్, లైక్స్
ఈ టీజర్ వ్యూస్ పరంగా సౌతిండియారికార్డులన్నీ బద్దలు కొట్టింది. యూట్యూబ్ లక్స్ పరంగా కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. కేవలం యూట్యూబ్ లోనే ఇప్పటి వరకు 8.5 మిలియన్ వ్యూస్ రాగా, 6.7లక్షల లైక్స్ వచ్చాయి. ఈ టీజర్ ఇంతకు ముందు ఉన్న వివేగం రికార్డులను బద్దలు కొట్టింది.
టీజర్
ప్రస్తుతం తెలుగు వెర్సన్ ‘అదిరింది' డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే తెలుగు టీజర్, పాటలను చేస్తామని శరత్ మరార్ తెలిపారు.


Click it and Unblock the Notifications











