For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  వామ్మో శింబునా? మేము నటించం.. పారిపోతున్న హీరోయిన్లు.. కారణం అదే..

  By Rajababu
  |

  తమిళ నటుడు శింబుపై అంబనవన్ అసరథావన్ అదంగథవన్ చిత్ర నిర్మాత మైఖేల్ రాయప్పన్ మరోసారి విరుచుకుపడ్డారు. ఆయన పక్కన నటించడానికి ఏ హీరోయిన్‌ కూడా ముందుకు రాలేదని ఆయన అన్నారు. శింబు పక్కన నటించే హీరోయిన్ ఎంపిక చేయడానికి నానా తంటాలు పడ్డామని మైఖేల్ వెల్లడించారు. శింబు ప్రవర్తన కారణంగా తాను 18 కోట్లు నష్టపోయానని, అన్ ప్రొఫెషనల్ బిహేవియర్ ఉన్న ఆయన లాంటి వ్యక్తిని తాను ఇప్పటి వరకు చూడలేదు గతంలో మండిపడిన సంగతి తెలిసిందే.

   శింబుపై మైఖేల్ మండిపాటు

  శింబుపై మైఖేల్ మండిపాటు

  శింబు వ్యవహారంపై మైఖేల్ గురువారం చెన్నైలో మరోసారి స్పదించారు. తానేదో గొప్ప హీరోను అని ఫోజులు కొడుతుంటాడు. ఆయన ప్రవర్తన చాలా దారుణంగా ఉంది. శింబుతో నటించడానికి ఏ హీరోయిన్ ముందుకు రాలేదు. త్రిషా అడ్వాన్సుగా తీసుకొన్న రెమ్యునరేషన్‌ను తిరిగి ఇచ్చేసింది. లక్ష్మీమీనన్ కూడా తీసుకొన్న సొమ్మును తిరిగి ఇచ్చేయడంతో కోచికి వెళ్లి నచ్చజెప్పాం. అయినా ఆమె నటించడానికి ముందుకు రాలేదు అని మైఖేల్ తెలిపారు.

   శింబుతో శ్రీయ సరన్

  శింబుతో శ్రీయ సరన్

  శింబు పక్కన నటించడానికి శ్రీయాసరన్ ఒప్పించాం. అయితే ఆమె యాక్టింగ్ బాగా ఉండదు అని శ్రీయాను తప్పించాలని శింబు కోరాడు. దాంతో శ్రీయాతో పాటను పూర్తిస్థాయిలో షూట్ చేయలేకపోయాం. శ్రీయా 13 రోజులు కేటాయిస్తే కేవలం 7 రోజులు మాత్రమే షూట్ చేశాం అని మైఖేల్ చెప్పారు.

   శింబు బాధపెట్టాడు..

  శింబు బాధపెట్టాడు..

  అంబనవన్ అసరథావన్ అదంగథవన్ చిత్ర షూటింగ్ సమయంలో శింబు కారణంగా చాలా బాధపడ్డాం. తరచుగా షూటింగ్ స్పాట్‌లను మార్చేసేవాడు. మధురైలో షూటింగ్ ప్లాన్ చేస్తే గోవాకు షిఫ్ట్ చేయమనే వాడు. ఓసారి దుబాయ్‌లో షూట్‌కు ప్లాన్ చేస్తే లండన్‌లో పెట్టమనే వాడు. చివరకు ఆ పోర్షన్‌ను చెన్నైలోని ఈస్ట్‌కోస్ట్ రోడ్‌లో షూటింగ్ చేయాల్సి వచ్చింది.

   హోటల్‌లో శింబు జల్సా

  హోటల్‌లో శింబు జల్సా

  షూటింగ్ కోసం మేము కేటాయించిన హోటల్‌లో విలాసవంతంగా జల్సా చేశాడు. దానిని ప్రశ్నించిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ను తొలగించమని శింబు ఒత్తిడి తెచ్చాడు. అలా నానా రకాలుగా మమల్ని వేధించాడు. ఈ విషయాన్ని తమిళ సినీ నిర్మాతల సంఘంలో ఫిర్యాదు చేశాం. ప్రస్తుతం మా ఫిర్యాదుపై చర్యలు తీసుకొనే ప్రయత్నంలో మండలి ఉంది అని మైఖేల్ వెల్లడించారు.

  English summary
  Producer Michael Rayappan of Anbanavan Asarathavan Adangathavan fame has accused Simbu for his careless and highly unprofessional behavior that made him incur massive losses to a tune of Rs. 18 crores. Speaking at a press meet yesterday night in Chennai alongside AAA director Adhik Ravichandran, Rayappan lashed out at Simbu for his callous attitude and exploiting his so-called stardom. “No heroine was ready to act with Simbu when we’re searching for the female leads for the project. Trisha repaid the advance paid to her and Lakshmi Menon refused to star in the film
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more