షాకింగ్ ఫస్ట్ లుక్: అరివీర భయంకరుడిగా సూపర్ స్టార్... (ఫోటోస్)

By Bojja Kumar

Recommended Video

అరివీర భయంకరుడిగా సూపర్ స్టార్... షాకింగ్ లుక్

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఎవరూ ఊహించని ఒక డిఫరెంట్ లుక్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఆయన మలయాళ మూవీ 'కాయంకులం కొచ్చున్ని'లో నటిస్తున్నారు. నివిన్ పాలీ హీరోగా తెరకెక్కుతున్న ఈ చితం 19వ శాతాబ్దానికి చెందిన ఒక దొంగల గ్యాంగ్ నేపథ్యంతో సాగుతుంది. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా మోహన్ లాల్ ఫస్ట్ లుక్ విడుదలైంది.

‘ఇత్తిక్కారపక్కి’ పాత్రలో మోహన్ లాల్

‘కాయంకులం కొచ్చున్ని' చిత్రంలో మోహన్ లాల్ ‘ఇత్తిక్కారపక్కి' అనే పేరుగల పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో పాత్ర చాలా కీలకంగా ఉండబోతోంది. హీరో నివిన్ పాలీ ట్విట్టర్ ద్వారా మోహన్ లాల్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

 అరివీర భయంకరుడు

అరివీర భయంకరుడు

‘ఇత్తిక్కారపక్కి' పాత్రలో మోహన్ లాల్ అరివీర భయంకరుడిగా, యోధుడిగా కనిపించబోతున్నాడు. ఆయనకు ఈ లుక్ పర్ఫెక్టుగా సూటయిందని, తెరపై సరికొత్త మోహన్ లాల్‌ను చూడబోతున్నాం అంటున్నారు అభిమానులు.

మోహన్ లాల్ వీరాభిమాని

మోహన్ లాల్ సినిమాలు చూస్తూ పెరిగిన నివిన్ పాలీ.... తాను హీరోగా నటిస్తున్న చిత్రంలో తన అభిమాన నటుడు భాగం కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల మోహన్ లాల్ షూటింగులో జాయిన్ అవ్వగానే ఆయనకు వెల్ కం చెబుతూ సెలబ్రేషన్స్ నిర్వహించారు.

‘కాయంకులం కొచ్చున్ని'

‘కాయంకులం కొచ్చున్ని'

‘కాయంకులం కొచ్చున్ని' ఒక పీరియడ్ ఫిల్మ్‌గా తెరకెక్కుతోంది. నివిన్ పాల్ కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ ఫిల్మ్. మోహన్ లాల్, నివిన్ పాల్, ప్రియా ఆనంద్, ప్రియాంక తిమ్మేష్, సన్నీ వేన్, బాబు ఆంటోనీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం కోసం నివిన్ పాల్ కేరళ సాంప్రదాయ యుద్ధవిద్య కలరియపట్టులో కూడా శిక్షణ తీసుకున్నాడు.

 సినిమా కథ ఏమిటి?

సినిమా కథ ఏమిటి?

19వ శతాబ్దానికి చెందిన ‘కాయంకులం కొచ్చున్ని' అనే దోపిడీ దొంగ జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. బ్రిటిష్ పాలన సమయంలో సెంట్రల్ ట్రావెన్ కోర్ ప్రాంతంలో ధనవంతులను దోచుకుని పేదలకు పంచే దొంగ కథ. ఈ చిత్రంలో మోహన్ లాల్ వీరికి సహాయ పడే ఇత్తికార పక్కి అనే దొంగ పాత్రలో కనిపించనున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X