»   » 'లైఫ్‌' డాక్యుమెంటరీకి బెస్ట్‌ డైరెక్టర్‌ అవార్డు

'లైఫ్‌' డాక్యుమెంటరీకి బెస్ట్‌ డైరెక్టర్‌ అవార్డు

Posted By:
Subscribe to Filmibeat Telugu

జైపూర్‌లో జరిగిన ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో డాక్యుమెంటరీ చిత్రాల విభాగంలో 'లైఫ్‌' పేరిట లఘచిత్రాన్ని నిర్మించిన కృతికా ఉధయానిధికి ఉత్తమ దర్శకత్వం అవార్డు లభించింది. ఎయిడ్స్‌ వ్యాధితో భాధపడుతున్న అమాయక పిల్లల జీవితాలపై 'లైఫ్‌' అనే లఘు చిత్రాన్ని ఆమె తీశారు. ఈ విభాగంలో 13 దేశాల నుండి మొత్తం 500 చిత్రాలు నమోదయ్యాయి. 100 చిత్రాలను పోటీలకు స్వీకరించారు. ఈ పోటీలలో చివరకు 'లైఫ్‌' చిత్రం బెస్ట్‌ డైరెక్షన్‌ విభాగంలో అవార్డు పొందినట్లు కృతికా ఉధయానిధి తెలిపారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu