కమల్‌ హాసన్ ,మమ్ముటి కలిసి నటిస్తున్నారు

By Srikanya

చెన్నై : మమ్ముటి ప్రస్తుతం కమల్‌హాసన్‌తో కూడా కలిసి నటించేందుకు సిద్దమయ్యాడు. విశ్వరూపం-2కు అనంతరం రమేష్‌ అరవింద్‌ తెరకెక్కించే 'ఉత్తమ విలన్‌' చిత్రంలో నటించనున్నాడు కమల్‌హాసన్‌. ఇందులో ఆయన విలన్‌గా కనిపించనున్నట్లు సమాచారం కాగా, కమల్‌తో కలిసి దక్షిణాదికే చెందిన మరో నలుగురు అగ్ర హీరోలు కూడా ఇందులో కనిపించనున్నారని సమాచారం. వారిలో ఒకరిగా మమ్ముటిని ఎంపిక చేశారు.

మమ్ముటి పాత్ర కథలో ఎంతో కీలకమని, ఆ పాత్రకు ఆయన అయితేనే న్యాయం చేయగలడని ఆయన్ను ఎంపిక చేసినట్లు కోలీవుడ్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి. విశ్వరూపం-2 పూర్తయిన వెంటనే ఉత్తమ విలన్‌ సెట్స్‌పైకి వెళ్లనుంది. కమల్ హాసన్ తన తదుపరి ప్రాజెక్టుకు రంగం సిద్దం చేసుకుంటున్నాడు. ఆ చిత్రానికి 'ఉత్తమ విలన్' అనే టైటిల్ ఖరారు చేసారు. కమలహాసన్ స్వీయ దర్శకత్వంలో హీరోగా దర్శకుడు లింగుస్వామి ఒక భారీ చిత్రాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రానికి ఉత్తమ విలన్ అనే పేరును పెట్టినట్లు తెలిసింది. ఇది పూర్తి హాస్యభరిత కథా చిత్రమని సమాచారం.

ఈ తరహా చిత్రాలకు సంభాషణలు రాయడంలో రచయిత క్రేజి మోహన్ పేరు గడించారు. ఉత్తమ విలన్ చిత్రానికీ ఆయనే మాటలు రాస్తున్నారు. హాస్యపాత్రలో వివేక్ నటించనున్నారు. ప్రస్తుతం కమలహాసన్ విశ్వరూపం-2 చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుంది. దీని తర్వాతే ఉత్తమ విలన్ తెరకెక్కనుంది.

'ఇదో ఎన్‌ తలబది.. ఎన్‌ ఉయిర్‌ నన్బన్‌'(ఇదిగో నా దళపతి.. నా ప్రాణ స్నేహితుడు) అంటూ రజనీకాంత్‌ను చూసి మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముటి చెప్పిన డైలాగ్‌లు ఎప్పటికీ మర్చిపోలేము. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'తలబది' చిత్రంలో రజనీకాంత్‌కు ప్రాణ స్నేహితుడిగా కనిపించి మెప్పించాడు మమ్ముటి. అలాగే ఈ చిత్రంలోనూ ముమ్మట్టి పాత్ర హైలెట్ కానుందని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X