twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ తెలుగు హీరోని డైరక్ట్ చేయబోతున్నా:మురగదాస్

    By Srikanya
    |

    ప్రస్తుతం సెవెంత్ సెన్స్ ప్రమోషన్ లో బిజీగా ఉన్న మురగదాస్ కి తెలుగు హీరో రామ్ చరణ్ తో సినిమా చేయాలని కోరిక ఉందిట. ఆ విషయాన్ని మీడియాకు చెప్తూ..నేను త్వరలో తెలుగులో మరో స్టైయిట్ సినిమా చేస్తాను.అందులో ఢెఫినెట్ గా రామ్ చరణ్ హీరోగా ఉంటారు. ఆయన మగధీరలో వర్క్ చూసి నేను చాలా ఇష్టపడ్డాను అన్నారు. మురగదాస్ తన తదుపరి చిత్రాన్ని షారూఖ్ ఖాన్ తో చేయనున్నారు. ఇక మురగదాస్ డైరక్ట్ చేసిన సెవెంత్ సెన్స్ ఈనెల 26న విడుదల కానుంది. గతంలో శివపుత్రుడు, అపరిచితుడు, పోతురాజు వంటి చిత్రాలను తెలుగులో అనువాదం చేసిన సుబ్రహ్మణ్యం లేటెస్ట్‌గా 'సెవెన్త్‌సెన్స్‌' విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం గురించి శనివారం ఆయన మాట్లాడుతూ...'రోబో ఎంతటి సెన్సేషనల్‌ క్రియేట్‌ చేసిందో అంతకంటే పదిరెట్లు క్రేజ్‌ ఏర్పడింది. సినిమారంగం ప్రయోగానికి కొత్తకాదు. క్రియేటివిటీ ఉంటేనే ఇక్కడ రాణిస్తారు. అలాంటి సృజనాత్మక అంశాలు దండిగా ఉన్న దర్శకుడు మురుగదాస్‌. ఆయన చేసిన చిత్రాలు తెలుగులో విడుదలయ్యాయి. ఆ కోవలో ఇదీ ఉంటుంది. కథకు సరైన హీరో సూర్య. ఆయన పాత్రే చిత్రానికి హైలైట్‌. కళ్ళతోనే అన్ని భావాలూ పలికిస్తాడు. బాడీ లాంగ్వేజ్‌ వెరైటీగా ఉంటుంది. ఇకపోతే హీరోయిన్‌ శృతిహాసన్‌ నటనతోపాటు గ్లామర్‌ కురుపిస్తుంది' అని చెప్పారు.అలాగే కథ గురించి మాట్లాడుతూ...మనిషి జీవితంలో సిక్త్‌సెన్స్‌ అనుభవం ఒక్కసారైనా ఎదురవుతుంది. జరగబోయే ఒక విషయం గురించి, సంఘటన గురించి ముందుగా మనం తెలుసుకోవటమే సిక్త్‌సెన్స్‌. మరి ఈ ఏడోసెన్స్‌ ఏంటి ! నటుడు సూర్య, దర్శకుడు మురుగదాస్‌లే ఈ విషయాన్ని చెప్పాలి. వారి తీసిన 'సెవెన్త్‌ సెన్స్‌' సినిమా విడుదలకు సిద్ధం కాబోతోంది. ఇందులోని అసలు కథ దర్శకుడు మురుగదాస్‌కే తెలుసునని నిర్మాత సుబ్రహ్మణ్యం అంటున్నాడు. శ్రీలక్ష్మీగణపతి ఫిలింస్‌పై ఈ చిత్రాన్ని తెలుగులో ఆయన విడుదల చేస్తున్నారు. సంగీతం గురించి మాట్లాడుతూ... 'హరీష్‌జైరాజ్‌ అద్బుతంగా ఇచ్చాడు. కథ రీత్యా దశబ్దాలనాటిది. కనుక దాని గురించి తగ్గట్లుగానే బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ అదరకొట్టాడు' అని అన్నారు.

    English summary
    Muraga Doss says-I have plans to do another straight Telugu film and it would definitely be with Ram Charan in the lead role. I like him and also loved his work in Magadheera
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X