»   » మణిరత్నం దగ్గర అసెస్టెంట్ గా చేస్తా...మురగదాస్

మణిరత్నం దగ్గర అసెస్టెంట్ గా చేస్తా...మురగదాస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తనకు మినిమం పదిరోజులైనా మణిరత్నం వద్ద అసెస్టెంట్ గా పనిచేయాలని ఉందని..ఆ అవకాశం ఇమ్మని ప్రముఖ దర్శకుడు మురగదాస్ సభాముఖంగా కోరటం ఇప్పుడు తమిళ పిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా చెప్పుకుంటున్నారు. రక్త చరిత్ర తమిళ వర్షన్ ఆడియో రిలీజ్ పంక్షన్ కి వచ్చిన ఆయన మాట్లాడుతూ..మణి సార్ నాకు ఎప్పుడూ ప్రేరణ ఇస్తూంటారు. ఆయన సినిమాల నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అయితే ఇప్పటివరకూ ఆయన్ని ఎప్పుడూ కలవలేకపోయాను. అయితే నా హీరో సూర్య వల్ల అది సాధ్యమైంది. ఆయనంతటి గొప్ప వ్యక్తి ప్రక్కన కూర్చోగలిగాను. మణిరత్నం గారికి ఓ రిక్వెస్ట్ ఆయన తదుపరి చిత్రానికి నేను అసెస్టెంట్ గా పనిచేయాలనుకుంటున్నాను.

ఓ పదిరోజులైనా అవకాసం ఇప్పించమని కోరుతున్నారు. అది నాకు బాగా ఉపయోగపడుతుంది అన్నారు. అయితే దానికి మణిరత్న చిన్న చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. ఇక ప్రస్తుతం మురగదాస్, సూర్య కాంబినేషన్ లో '7 ఓం అరివు' అనే చిత్రం రూపొందుతోంది. ఈచిత్రం కథ సర్కస్ నేపధ్యంలో జరగనుంది. ఈ చిత్రంలో సూర్య సర్కస్‌ కళాకారుడిగా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. దీంట్లో సూర్య పాత్ర చుట్టూనే కథ నడుస్తుంది. యానిమల్ ట్రైనర్ గా ఓ విభిన్నమైన పాత్ర ఇది అని చెప్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu