For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అనుష్క ఉందనే నాగ్ చిత్రం తమిళం డబ్బింగ్...

  By Srikanya
  |

  చెన్నై : అనుష్క కి తమిళ నాట ఉన్న క్రేజ్ వేరు. ఆమె రీసెంట్ చిత్రం సింగం లో కూడా ఆమె కనపడింది కాసేపే అయినా బిజినెస్ పరంగా చాలా హెల్ప్ అయ్యింది. అంతేకాదు ఆమె తాజా చిత్రం వర్ణ కూడా తమిళంలోనే రూపొంది తెలుగులోకి వస్తోంది. ఈ నేపధ్యంలో ఆమె పాత తెలుగు సినిమాలను తమిళంలోకి డబ్ చేసి వదలుతున్నారు.

  నాగార్జున- పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'సూపర్‌' అదే పేరుతో తమిళ ప్రేక్షకుల చెంతకు రానుంది. వీరి కాంబినేషన్‌లో శివమణి తర్వాత రెండో చిత్రంగా సూపర్‌ వచ్చి అలరించింది. ఇందులో నాగార్జున కొత్త కేశాలంకరణ, అయేషా టకియా అందాలు ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రం అప్పట్లోనే రోబరి టైటిల్ తో హిందీలోకి డబ్బింగ్ అయ్యింది.

  ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న అనుష్క వెండితెరకు ఈ చిత్రం ద్వారానే పరిచయం కావడం విశేషం. ఆమెను చూపే బిజినెస్ చేయనున్నారని చెన్నై వర్గాల్లో వినపడుతోంది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తమిళంలో విడుదల చేసే పనులు వేగవంతం అయ్యాయి. ఈ నేపథ్యంలో డబ్బింగ్‌ కొనసాగుతోంది. నెలాఖరు నాటికి ప్రేక్షకుల చెంతకు తీసుకురానున్నారు.

  ఇక ప్రస్తుతం నాగార్జున..భాయ్ చిత్రం చేస్తున్నారు. యాక్షన్ కామెడీగా రూపొందుతున్న నాగార్జున తాజా చిత్రం 'భాయ్' . పూలరంగడు,అహనా పెళ్లంట ఫేమ్ వీరభద్రమ్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైనట్లు వినపడుతోంది. దాదాపు 2.80 కోట్ల వరకూ ఈ రైట్స్ వెళ్లినట్లు చెప్పుకుంటున్నారు. బిజినెస్ కూడా అంతే స్పీడుగా జరుగుతోందని...వీరభద్రం హ్యాట్రిక్ కొడతాడని అంటున్నారు

  . ఈచిత్రాన్ని నాగార్జున పుట్టినరోజును పురస్కరించుకుని ఆగస్టు 29న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే యూరప్‌లోని స్లోవేనియా, ఇటలీల్లో నాగార్జున, రిచా గంగోపాధ్యాయలపై బృంద నృత్య దర్శకత్వంలో రెండు పాటల్ని షూట్ చేసుకుని వచ్చింది. వీరభద్రం తనదైన శైలిలో మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కామ్నాజఠ్మలానీ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. రామ్‌గోపాల్‌వర్మ 'డిపార్ట్‌మెంట్' ఫేం నథాలియాకౌర్‌పై ఆ మధ్య ఐటం సాంగ్ చిత్రీకరించారు.

  నాగార్జున ఈ చిత్రం గురించి మాట్లాడుతూ....భాయ్ చిత్రం సీరియస్‌గా వుండే దావుద్ ఇబ్రహీం లాంటి కథ అని భావిస్తున్నారని, కానీ పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ చిత్రం ఉంటుందని ఆయన వివరించారు. అలాగే'భాయ్' మాఫియా నేపథ్యం కాదు. 'హలో బ్రదర్' సినిమా తరహాలో పూర్తి వినోదాత్మకంగా వుంటుంది. ఇందులో నా పాత్ర 'కింగ్'లో బొట్టు శ్రీనులా వినోదాన్ని పంచుతుంది అన్నారు.

  దర్శకుడు వీరభద్రమ్ చౌదరి చిత్ర విశేషాలు తెలియజేస్తూ 'రెండున్నర గంటలు కడుపుబ్బా నవ్వించే చక్కటి హాస్య చిత్రమిది. 'హలో బ్రదర్' తరహాలో నాగార్జున పాత్ర చిత్రణ వుంటుంది. ఇందులో నాగార్జున మాఫియా డాన్ పాత్రను చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. అసలు మాఫియా అనే అంశమే ఈ చిత్రంలో వుండదు. నాగార్జున సంభాషణలు, మేనరిజమ్స్ సరికొత్త పంథాలో వుంటాయి. ఆయన అభిమానుల్ని అలరించే అంశాలన్నీ 'భాయ్'లో వున్నాయి' అన్నారు.

  English summary
  Nagarjuna’s Super film will be dubbed into Tamil. Super is a 2005 Telugu film written and directed by Puri Jagannadh. The film stars Akkineni Nagarjuna, Ayesha Takia, Sonu Sood, and Anushka Shetty. Soundtrack of the film was composed by Sandeep Chowta. The film was also dubbed into Hindi and was titled Robbery.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X