#JagameThandiram : హీరో పేరు తేడాగా ఉందే.. ఆడుకుంటున్న నెటిజన్లు
తమిళ స్టార్ హీరో ధనుశ్, దర్శకుడు కార్తీక్ సుబ్బురాజ్ కాంబినేషన్ లో తెరెకెక్కిన తాజా మూవీ జగమే తంత్రం. ఈ సినిమాను తమిళంలో జగమే తందిరమ్ పేరుతో తెరకెక్కించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయాలని ముందు నుంచీ భావించినప్పటికీ కరోనా రెండో దశ కారణంగా ఇప్పట్లో పూర్తి స్థాయిలో థియేటర్ లు రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపించలేదు. పోనీ ఒక పక్క థియేటర్లలో అలాగే మరో పక్క ఓటీటీలో రిలీజ్ చేయాలని ప్లాన్లు వేసినా అవేవీ సక్సెస్ కాలేదు. దీంతో మేకర్స్ ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు మొగ్గు చూపారు. దీంతో ఈ సినిమా నేడు అంటే జూన్ 18వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది.
కానుంది. మరీ ముఖ్యంగా భారతదేశంలో ఈ సినిమాని మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు రిలీజ్ చేయడం విశేషం. అయితే అంతా బాగానే ఉన్నా ఈ సినిమా తెలుగు వెర్షన్ లో హీరో పేరు మాత్రం కాస్త అసభ్యకరంగా వినిపిస్తోంది. నిజానికి సినిమాలో హీరో పాత్ర పేరు సురులి, ఇది తెలుగులో ఒక బూతు పదానికి దగ్గరగా ఉండడంతో జనం కాస్త ఈ పదం విషయంలో ఆ సౌకర్యంగా ఫీల్ అవుతున్నారు. దీంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా దీని గురించి చర్చ జరుగుతోంది. కనీసం తెలుగు వరకు అయినా ఈ పేరు మార్చి ఉంటే బాగుండేది అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా మొత్తం 190 దేశాల్లో 17 భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేసింది నెట్ ఫ్లిక్స్. ముఖ్యంగా ఒరిజినల్ తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, పోలిష్, పోర్చుగీస్, బ్రెజిలియన్, స్పానిష్, థాయ్, ఇండోనేషియా, వియత్నామిస్ తదితర ప్రపంచ భాషల్లో విడుదలకానుంది. ఈ సినిమా కథ అంతా లండన్ నేపథ్యంలో సాగుతుంది. ఇక సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాను శశికాంత్, చక్రవర్తి రామచంద్ర సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో డాన్ పాత్రలో నటించిన ధనుష్ సరసన కళ్యాణి ప్రియదర్శిన్ హీరోయిన్ గా నటించింది.


Click it and Unblock the Notifications











