»   » ఎక్సపీరియన్స్ అవసమని భావించే వారిని కలిసాను...నమిత

ఎక్సపీరియన్స్ అవసమని భావించే వారిని కలిసాను...నమిత

Posted By:
Subscribe to Filmibeat Telugu

అనుభవం లేని విషయాలు ఉన్నవారని అడిగి తెలుసుకోవాలంటోంది నమిత. ఆమె తాజాగా చేస్తున్న 'లవ్‌కాలేజ్' చిత్రంలో లెక్చరర్ పాత్రలో నటిస్తోంది. అందుకోసం ఆమె కొందరు లెక్చరర్స్ ని కలసి ఈ పాత్రను చేసిందని చెప్తోంది. ఎందుకంటే లెక్చరర్స్ ఎలా బిహేవ్ చేస్తారో తెలుసుకుంటే, ఆ ఎక్సపీరియన్స్ లేకుపోయినా లీనమై చేసేయచ్చు అంటోంది. అలాగే ఈ చిత్రంలో చెడుదోవ పడుతున్న విద్యార్థులను సన్మార్గంలో పయనించేలా చేసే లెక్చర్ క్యారెక్టర్ నాది. విద్యార్థులతో ఎలా నడుచుకోవాలి, ఆ వయసులో వారి మనస్తత్వం ఎలా ఉంటుంది, లెక్చరర్స్ చెప్పే మాటలు స్టూడెంట్స్‌కి ఎక్కుతాయా తదితర విషయాలపై నాకు అవగాహన లేదు. అందుకే అనుభవజ్ఞులైన అధ్యాపకులతో అడిగి మరీ తెలుసుకుని నటిస్తున్నాను అంటోంది. అలాగే ఈ చిత్రం కోసం కొంతమంది సైకాలజిస్టులను కూడా సంప్రదించాను. ఓ పాత్ర ఒఫ్పుకుని నటించేటప్పుడు పాత్రకు సంబంధించి ఆ మాత్రం హోమ్ వర్క్ చేయకపోతే ఎలా అని క్లాసులు పీకుతోంది. ఇక నన్ను అందరూ ఇలా లావుగా చూడటానికే ఇష్టపడుతున్నప్పుడు నేను ఎందుకు తగ్గాలి అని ప్రశ్నిస్తోంది నమిత. అలాగే ఎక్కువ ఒళ్ళు వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలేమీ నా దరి చేరవు. ఎందుకంటే రెగ్యులర్ ‌గా ఎక్సర్ సైజ్ లు చేస్తుంటాను. అయినా లావుగా వుండటం అనేది నా శరీరతత్వం మాత్రమే అని ఎప్పటిపాటే పాడింది. ప్రస్తుతం నమిత ప్రధాన పాత్రలో నమిత ఐ లవ్ యు అనే కన్నడ చిత్రం రెడీ అవుతోంది.

English summary
Hot Actress Namitha is playing the role of a Yoga Teacher in her forthcoming film titled ‘Love College’. The film deals with how a Yoga Teacher brings the change in the lives of four useless young boys. Currently, shooting of the film is progressing fastly.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu