twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నమిత భారీ అందాలనే పెట్టుబడిగా పెట్టి...

    By Srikanya
    |

    సింహా చిత్రం విజయంతో నమితకు మళ్ళీ క్రేజ్ వచ్చింది. ఆమె అందాలనే పెట్టుబడిగా పెట్టి చేసినట్లున్న చాణుక్య అనే తమిళ చిత్రం 'మోసగాళ్లకు మోసగాడు' అనే టైటిల్ తో డబ్బింగై వస్తోంది. ఇందులో నమిత ఆటో యజమానురాలిగా కనిపించి అందాలు ఆరబోస్తుంది. దర్శకుడు ఎ.వెంకటేష్ రూపొందించిన ఈ చిత్రంలో హీరోగా శరత్ కుమార్ చాణుక్య గా టైటిల్ రోల్ చేసారు. ఇందులో శరత్ కుమార్ గణేష్ అనే ఆటో డ్రైవర్ పాత్ర చేసారు. అతను మంచి పనులు చేస్తూ అందరి మెప్పునూ పొందుతూంటాడు. అతను నడిపే ఆటో దేవనాయకి(నమిత) ఓనర్. ఆమె అతనితో మెల్లిగా ప్రేమలో పడుతుంది.

    ఈ లోగా అంజలి అనే ఇన్విస్టిగేట్ పోలీస్ ఆఫీసర్ గణేష్ ని అనుమానిస్తూ ఓ ఫిల్మ్ మేకర్ ని అని చెప్పి రంగంలోకి దిగుతుంది. గణేష్ తో సినిమా చేస్తానంటూ అతనికి దగ్గరయి అతని గతాన్ని త్రవ్వటానికి ప్రయత్నిస్తుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో శరత్ కుమార్ తండ్రిని విలన్స్ చంపిన విషయం బయిటకు వస్తుంది. తన తండ్రి మరణానికి కారణమైన వారిని అతను ఎలా చంపుతూ పగ తీర్చుకుంటున్నాడనే విషయం ఆమెకు తెలుస్తుంది. అప్పుడామె చేసిందామె అనే దిశలో క్లైమాక్స్ వస్తుంది. ఇక ఈ చిత్రాన్ని డబ్ చేయటానికి కారణం నమిత సింహా చిత్రంతో బాగా పే చేయటమేనని అంటున్నారు. నమిత అందాలనే పెట్టుబడిగా పెట్టి చేసిన ఈ చిత్రం తెలుగులోనూ వర్కవుట్ అవుతుందని ఆశిస్తున్నారు.

    జయప్రద పిక్చర్స్ పతాకంపై వాసిరెడ్డి పద్మాకరరావు ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం డిటీయస్ మిక్సింగ్ జరుగుతున్న ఈ సినిమా గురించి పద్మాకరరావు తెలియజేస్తూ యాక్షన్, సెంటిమెంట్, హాస్యం మేళవింపుతో దర్శకుడు వెంకటేశ్ ఈ చిత్రాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా తీర్చిదిద్దారు అన్నారు. అలాగే ఈ నెల 25 కల్లా తొలి కాపీ తీసుకొచ్చి, జూన్ ప్రథమార్థంలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం అని చెప్పారు. సీత, వడివేలు, విన్సెంట్ అశోక్ నటించిన ఈ చిత్రానికి కథ: పంజు అరుణాచలం, మాటలు: ఎం. రాజశేఖరరెడ్డి, పాటలు: వనమాలి, సంగీతం: దేవా, ఛాయాగ్రహణం: మధు అంబట్, కూర్పు: సురేంద్రనాథ్ ‌రెడ్డి, ఫైట్స్: సుబ్బరాయన్, కళ: ఆర్.కె., స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ. వెంకటేశ్.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X