»   »  కొండచిలువకు నమిత ముద్దులు

కొండచిలువకు నమిత ముద్దులు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Namitha
ఇప్పుడు తమిళంలో బొద్దుగుమ్మ నమిత హవా నడుస్తోంది. దీంతో నమిత ఏం చేసినా కోలీవుడ్‌లో విపరీతమైన ప్రచారం లభిస్తోంది. తాజాగా ఓ తమిళ చిత్రం పాట షూటింగ్ లో నమిత కొండచిలువను మెడలో వేసుకుని డాన్స్ చేయాల్సి వచ్చిందిట. ఆమె మొదట దానినిచూసి భయపడి మొండికేసిందిట.కాని తప్పని స్థితిలో డాన్స్ చేసిందట. అలా కాస్సేపటికి భయం పోయి దానికి అలవాటు పడిపోయిందిట. అంతేగాక షూటింగ్ ముగిశాక కూడా నమిత ఆ కొండచిలువతో ఆడుకుంటూనే ఉందట.

కాస్సేపటికి ఆ కొండచిలువపై మరి కాస్త ప్రేమ పెరగడంతో ముద్దులు కూడా పెట్టేసిందట. ఇది అక్కడున్న ఫొటో గ్రాఫర్ కి విపరీతంగా నచ్చేసి కెమారా క్లిక్ మనిపించాడుట. దాంతో నమిత కొండచిలువతో ఉన్న ఫోటోలు అభిమానులకు అందుబాటులోకి వచ్చాయి. ఇది చూసిన అభిమానులు నమిత ధైర్యానికి తెగ మెచ్చుకుంటున్నారట. మరి కొంత మంది అయితే ఆ కొండచిలువ అదృష్టం తమకెందుకు పట్టలేదా అని మథన పడుతున్నారుట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X