»   » సన్నబడింది, భయ పెడుతోంది (నమిత షాకింగ్ లుక్)

సన్నబడింది, భయ పెడుతోంది (నమిత షాకింగ్ లుక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జెమిని సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నమిత అప్పట్లో తన అందం, నాజూకు తనంలో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తమిళ సినిమా ఇండస్ట్రీలోకి ఎంటరైన తర్వాత నమిత భారీగా లావెక్కింది. ఎంతగా అంటే ఇక ఆమె సినిమాకు పనికి రాదని దర్శకులు, నిర్మాతలు భయపడేంత. గత మూడేళ్లుగా నమిత అసలు వార్తల్లోనే లేదు. ఏ సినిమాలోనూ నటించలేదు.

Namitha next movie Pottu

ఇన్నాళ్లు సినిమాలకు దూరమైన నమిత బరువు తగ్గేందుకు ప్రత్యేకంగా ట్రీట్మెంట్ తీసుకుంది. బరువు తగ్గడంతో అవకాశాలు కూడా వస్తున్నారు. ప్రస్తుతం ఆమో తమిళంలో ‘పొట్టు' అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. ఇదో హారర్ ఫిల్మ్. ఇందులో ఇందులో నమిత అఘోరాలను తలపించే షాకింగ్ లుక్ తో కనిపించబోతోంది. ఈ చిత్రానికి వడిఉదయన్ దర్శకత్వం వహిస్తున్నారు.

భరత్, ఇనియా, నమిత, మనీషా యాదవ్ తదితరులు ఈచిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సంవత్సరం ద్వితియార్థంలో సినిమా ప్రేక్షుకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా తర్వాత మళ్లీ తనకెరీర్ పుంజుకుంటుందని నమిత ఆశిస్తోంది. ‘పొట్టు' సినిమాకు సంబంధించిన పోస్టర్ పై మీరూ ఓ లుక్కేయండి.

Read more about: namitha, నమిత
English summary
Namitha next movie Tamil horror film titled Pottu. Namitha's ganja puffing aghori look has sent a sudden chill down the spine of her fans. Needless to say, Namitha pulled off her look with a terrific attitude.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu