For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రజనీపై నానా పటేకర్ కామెంట్స్, అంతా షాక్

  By Srikanya
  |

  చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్..సౌతిండియా జనాలికి డెమీ గాడ్. ఆయన అంటే అందరికీ ఇష్టమే. అందుకే ఆయన ఈ వయస్సులోనూ చేసిన సినిమాకు ఓ రేంజిలో క్రేజ్ వచ్చింది. రిలీజ్ డేట్ ప్రకటించి, అడ్వాన్స్ బుక్కింగ్ ప్రారంభించగానే మొదటివారం టిక్కెట్లు క్షణాల్లో తెగిపోయాయి. ఆయనమీద అభిమానానికి కారణం కేవలం ఆయన సినిమాలే కాదు ఆయన వ్యక్తిత్వం కూడా అని చెప్పవచ్చు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఆయన, ఆయన నిరాడంబర లైఫ్ స్టైల్ జనాలకు తెగ నచ్చుతాయి.

  ఆయన సినిమా హిట్టా, ఫట్టా అనేది వారు పట్టించుకోకుండా తెరమీద ఆయన్ను చూడటానికే ఇష్టపడతారు. ఆయన్ను అలా చూస్తూండపోవటానికే ధియేటర్స్ కు వెళ్లే జనం ఉన్నారంటే అతిశయోక్తి కాదు. మరి అలాంటి సూపర్ స్టార్ పై ఎవరైనా కామెంట్ చేయటానికి సాహసిస్తారా. అయితే నానా పటేకర్ సాహసం చేసారు.

  మొన్న శుక్రవారం రిలీజైన కబాలి ...ప్రపంచ వ్యాప్తంగా క్రియేట్ చేసిన ప్రకంపనాలు అన్ని ఇన్నీకాదు. రిలీజ్ అయి ఐదు రోజులు దాటుతున్నా ఇప్పటికీ ఈ సినిమాకు సంబందించిన వార్తలు హెడ్ లైన్స్ లో వినిపిస్తూనే ఉన్నాయి.

  ఓ ప్రక్కన డివైడ్ టాక్ తో సినిమా మొదలైనా .. ఈ సినిమా కలెక్షన్ల పై ఎక్కడా ఎఫెక్ట్ చూపలేదు. సినిమా రికార్డ్ లను బద్దలు కొడుతూ దూసుకుపోతుంది. ఈ నేఫద్యంలో బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ నానా పటేకర్ రజనీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయటం అంతటా సంచలనమైంది.

  ఓ ప్రైవేట్ ఈవెంట్ లో మీడియా ప్రతినిధిలు కబాలి గురించి అడిగిన ప్రశ్నకు బదులుగా 'ఇండియాలో సినిమానే సూపర్ స్టార్, ప్రత్యేకంగా నటుల్లో సూపర్ స్టార్ లు ఎవరూ లేరు. సినిమా కథ బాగుంటే చిన్న సినిమా కూడా భారీ వసూళ్లను సాధిస్తుంది. అదే కథ బాలేకపోతే స్టార్ హీరో సినిమా కూడా మూడు రోజుల్లో థియేటర్ల నుంచి వెళ్లిపోతుంది'. అంటూ కామెంట్ చేశాడు.

  నానాపటేకర్ ఇంకేమాట్లాడారో చూద్దాం...

  క్రేడిట్ మొత్తం

  క్రేడిట్ మొత్తం

  ఈ రోజున స్క్రిప్టు రైటర్లదే రాజ్యం. వాళ్లు ఎక్సలెంట్ స్క్రిప్టులు రాస్తేనే సూపర్ స్టార్ క్రియేట్ అవుతారు.

  బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తే

  బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తే

  ఎవరన్నా నటుడుకు ఓ దర్శకుడు లేదా స్క్రిప్టు రైటర్ తన అద్బుతమైన స్క్రిప్టు నైపుణ్యంతో బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తే వాళ్లకే క్రెడిట్ ఇవ్వాలి. సినిమా లేదనే సూపర్ స్టార్స్ రారు కదా.

  దారుణమైన ప్లాఫ్

  దారుణమైన ప్లాఫ్

  ఎంత స్టార్ నటించిన సినిమా అయినా సినిమా బాగోలేక పోతే రెండు,మూడు రోజులు కన్నా ధియేటర్స్ లో ఉండదు.

  వాళ్లకే ఇంపార్టెన్స్

  వాళ్లకే ఇంపార్టెన్స్

  ఈ రోజున రైటర్స్ కే ఎక్కువ ఇంపార్టెన్స్. వాళ్లు మనుగడ మీదే సినిమాలు విజయావకాశాలు ఆధారపడతాయి

  సలీం-జావేద్

  సలీం-జావేద్

  ప్రముఖ రచయితలు సలీం, జావేద్ ఇద్దరూ అద్బుతమైన స్క్రిప్టులతో ఇండస్ట్రీకు ఓ స్టేటస్ ఇచ్చారు.

  సినిమా..కథని బట్టే

  సినిమా..కథని బట్టే

  సినిమా బాగుండాలంటే ఖచ్చితంగా కథ అంతకన్నా బాగుండాలి.

  కథలేకపోతే

  కథలేకపోతే

  కథ బాగోపోతే ఎంత గొప్పగా తీసినా సినిమా కూడా బాగోదు. అందులో ఎవరు నటించినా ఏం చెయ్యలేరు

  పేపరు పైన బాగుండాలి

  పేపరు పైన బాగుండాలి

  కథ మొదట పేపరుమీద బాగుండాలి. అప్పుడే అది తెరకు అంతే బాగా తెరకెక్కుతుంది.

  రక్షించలేరు

  రక్షించలేరు

  కథే బాగోపోతే ఎంత పెద్ద స్టార్ కూడా రక్షించలేరు

  రెండు రోజులు మించి

  రెండు రోజులు మించి

  మహా అయితే ఓ స్టార్ ..రెండు రోజులు వరకూ స్టార్స్ ని ధియోటర్ వరకూ తేగలడు

  మండిపాటు

  మండిపాటు

  ఇప్పటికే నానాపటేకర్ కామెంట్స్ పై ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు

  విమర్శలు

  విమర్శలు

  నానా పటేకర్ కు రజనీ గొప్పతనం గురించి, ఆయన ఇమేజ్ గురించి తెలియకుండా కామెంట్ చేసాడని అంటున్నారు.

  English summary
  Nana Patekar credited writers for writing excellent scripts that make films a blockbuster hit which in turn create superstars.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X