»   » విక్రమ్, సూర్య లా విశాల్ కి కూడా ఓ నేషనల్ అవార్డ్..!

విక్రమ్, సూర్య లా విశాల్ కి కూడా ఓ నేషనల్ అవార్డ్..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

డైరెక్టర్ బాలా సినిమాల్లో హీరోలు ఎంత విచిత్రంగా కినిపిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈసారి కూడా బాలా తన మార్కు పోగొట్టుకోలేదు. త్వరలో రాబోతున్న'వాడు వీడు" సినిమాలో విశాల్ చేత ఊహించనివి కాని పాత్ర చేయించాడు. ఇందులో విశాల్ 'థర్డ్ జెండర్"గా నటించారు. తన కెరీర్ లోనే అత్యద్భుత ప్రతిభ కనబరిచాడని విశాల్ ని ప్రశంసిస్తున్నారు. ఇలాంటి పాత్రలతోనే జాతీయ అవార్డుల్ని తమిళ చిత్ర సీమ దక్కించుకుంటోంది.

ఉత్తమ నటుడిగా విక్రమ్ కి పితామగన్ అవార్డు తెచ్చిపెడితే, పరుత్తివీరన్ తో ప్రియమణికి ఆ ఖ్యాతి దక్కింది. తాజాగా ఆడుకులంతో ధనుష్ కూడా జాతీయ అవార్డు గెలుచుకున్నాడు.మరి విశాల్ కూడా వారి బాటలోనే 'వాడు వీడు"తో జాతీయ అవార్డు గెలుచుకుంటాడా? ఒక మాస్, యాక్షన్ హీరో ఇలాంటి పాత్ర చేయడానికి సాహసించడమే అతనికి బోలెడు రివార్డుల్ని తెచ్చిపెడుతోంది. బాలా చేయి పడ్డాక నెక్స్ ట్ లెవల్ కి వెళ్లిన సూర్య, విక్రమ్ లా విశాల్ కూడా ఈ చిత్రంతో టాప్ లీగ్ లోకి చేరతాడేమో చూడాలి.

English summary
This time around, Bala has chosen Vishal who had only been seen in commercial films, to show the actor’s mettle and what he is made up of. It is rumored strongly in Kollywood that Vishal’s role in ‘Avan Ivan’ is likely to fetch him many an award and it may not be surprising if he even ends up winning the coveted national award for ‘best actor’ for his role in the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu