మరోసారి కమల్,మణిరత్నం కాంబినేషన్ పై సుహాసిని

By Srikanya

చెన్నై :మణిరత్నం, కమల్‌హాసన్‌ కాంబినేషన్లో త్వరలో ఓ చిత్రాన్ని నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని మణిరత్నం భార్య సుహాసిని పేర్కొంది. పాతికేళ్ల క్రితం వీరిద్దరి కలయికలో 'నాయకన్‌' సినిమా వచ్చి సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే. రీసెంట్ గా కమల్ నాయకుడు చిత్రాన్ని గుర్తు చేసుకున్నారు. అంతేగాక మణిరత్నం ఇంటికి వెళ్లి మాట్లాడి వచ్చారు. ఈ నేపధ్యంలో మరో చిత్రం వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందే అవకాసం ఉందంటూ వార్తలు వచ్చాయి. అయితే వెంటనే సుహాసిని కలగచేసుకుని క్లారిఫై చేసారు.

ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో 'కడల్‌' అనే సినిమా రూపొందింది. తెలుగులోనూ 'కడలి' పేరుతో ఇది రాబోతోంది. తమిళ హీరో కార్తీక్‌ నట వారసుడు గౌతమ్‌, రాధ చిన్న కుమార్తె తులసి జంటగా ఆయన తెరకెక్కిస్తున్న చిత్రమే 'కడల్‌'. ఇందులో అర్జున్‌, అరవింద్‌స్వామి తదితరులు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. షూటింగ్‌ చివరి దశలో ఉంది. ఈ చిత్రం ఆడియోను త్వరలో ఆవిష్కరించనున్నట్లు సమాచారం. సినీ రంగానికి చెందిన ప్రముఖులు పలువురు పాల్గొంటారని కోలీవుడ్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

సముద్రం నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. ఎక్కువ భాగం కేరళలో తెరకెక్కించారు. ఏ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం అందించారు. వనమాలి సాహిత్యం సమకూరుస్తున్నారు. నవంబరులో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలున్నాయి. 'కడలి'కి సంబంధించిన పూర్తి వివరాలు దర్శక,నిర్మాతలు త్వరలో వెల్లడిస్తారు. మంచు లక్ష్మీ ప్రసన్న ఈ చిత్రంలో హీరోయిన్ తల్లిగా కనిపించనుందని సమాచారం. ఈ చిత్రంలో ఆమె యాక్షన్ స్టార్ అర్జున్ కి భార్యగా కనిపించనుంది.

మంచు లక్ష్మి, అర్జున్ ఇద్దరూ మిడిల్ క్లాస్ జంటగా కనిపిస్తారు. వీరి ముద్దులు కూతురు తులసి. తులసి ప్రేమ కథ చుట్టూ కథ జరుగుతుంది. అరవింద్ స్వామి కీ రోల్ లో చేస్తున్న ఈ చిత్రానికి రాజీవ్ మీనన్ కెమెరా వర్క్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ హైలెట్ అని చెప్తున్నారు. జెమిని ఫిల్మ్ సర్క్కూట్ వారు ఈ చిత్రాన్ని రికార్డు స్థాయి ధర చెల్లించి థియేటర్ రైట్స్ సొంతం చేసుకున్నారని సమాచారం. ఈ చిత్రం మద్రాసు టాకీస్ పతాకంపై రూపొందుతున్న 14వ చిత్రం. అలాగే మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న 23వ చిత్రం కావడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X