»   » విడిపోయిన నయనతార, శింబు మళ్ళీ ‘గోవా’లో

విడిపోయిన నయనతార, శింబు మళ్ళీ ‘గోవా’లో

Posted By:
Subscribe to Filmibeat Telugu

నయనతార, శింబుల ప్రేమాయణం కొంతకాలం జరిగి తర్వాత విభేదాలుతో విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే వెండితెరపై హాట్ పెయిర్ అయిన వీరిద్దరూ మరోసారి గోవా అనే చిత్రంలో కనపించనున్నారు.వైభవ్, స్నేహ, సింధు, శింబు, నయనతార కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'గోవా". తమిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని సాయిబాలాజీ ఫిలింస్ పతాకం వెంకట్ ప్రభు దర్శకత్వంలో గంగవరపు శ్రీనివాసులు నాయుడు, ఎస్.కె.బాబు అనువదిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పాటలు శ్రేయ మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి. ఆడియో సీడీని నాగబాబు ఆవిష్కరించి నిర్మాత బెల్లంకొండ సురేష్‌కు అందచేసారు.

ఈ సందర్భంగా చిత్రనిర్మాత గంగవరపు శ్రీనివాసులునాయుడు మాట్లాడుతూ- 'ముగ్గురు స్నేహితులు గోవా చూడడానికి వెడతారు. అక్కడ ముగ్గురూ ముగ్గురమ్మాయిలను ప్రేమిస్తారు. అనుకోకుండా ఆ ముగ్గురు అమ్మాయిలవల్ల సమస్యల్లో పడతారు స్నేహితులు. వారు ఆ సమస్యలనుండి ఎలా బయటపడ్డారన్నదే చిత్ర కథాంశం. శింబు, నయనతార కీలకమైన సన్నివేశాల్లో కనిపిస్తారు. పూర్తి వినోదాత్మకంగా సాగే ఈ చిత్రాన్ని వేసవి కానుకగా విడుదల చేయనున్నామ"ని తెలిపారు.

English summary
Former lovers have got back together. Sources say that the new Tamil film 'Goa' will have the two stars - Nayantara and Simbu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu