»   » లవ్‌ మ్యారేజ్‌ కి వ్యతిరేకిని కాదు నయనతార

లవ్‌ మ్యారేజ్‌ కి వ్యతిరేకిని కాదు నయనతార

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇటీవల మీనా, నవ్యనాయర్‌ కి పెళ్లయ్యింది. త్వరలో రంభ పెళ్లవ్వబోతోంది. మరి.. మీ పెళ్లెప్పుడు? అని నయనతారను అడిగితే... ఈ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. పెళ్లనేది జీవితానికి సంబంధించిన ఓ మలుపు. ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోలేం కదా. సమయం వచ్చినప్పుడు అదే జరుగుతుంది. లవ్‌ మ్యారేజ్‌కి నేను వ్యతిరేకిని కాదు. పెద్దలు కుదిర్చిన వివాహం పట్ల కూడా విశ్వాసం ఉంది. ఒకవేళ నేను లవ్‌ మ్యారేజ్‌ చేసుకున్నా మా అమ్మ, నాన్న సమ్మతిస్తేనే చేసుకుంటాను అంది. ఇక ఈ మధ్యకాలంలో నయనతార ముక్కుకి తగిలించుకున్న రింగ్‌ కూడా టాపిక్‌ అయ్యింది. దాని గురించి చెబితే...చెప్పడానికి రహస్యం ఏదీ లేనప్పుడు ఏం చెప్పగలను. ముక్కుకి రింగ్‌ బాగుంటుందనిపించింది. పెట్టుకున్నా అని తేల్చేసింది. ఇక సినిమాల గురించి మాట్లాడుతూ...ఓ సినిమా హిట్‌ అయ్యిందంటే నాకు పట్ట రానంత ఆనందం కలుగుతుంది. ఒకవేళ ఫ్లాప్‌ అయ్యిందనుకోండి తెగ బాధపడిపోతాను. లక్కీగా ఈ మధ్యకాలంలో నాకు బాధపడే అవసరం రాలేదు. ఇటీవల తెలుగులో 'అదుర్స్‌', తమిళంలో 'ఆదవన్‌', మలయాళంలో 'బాడీగార్డ్‌' చిత్రాలు ఒకదాని తర్వాత ఒకటి విడుదలై విజయం సాధించాయి. వినాయక్‌ తో నేను చేసిన 'లక్ష్మీ' హిట్‌ అయ్యింది. మళ్లీ ఆయన దర్శకత్వంలో 'అదుర్స్‌'లాంటి హిట్‌ అందుకోవడం ఆనందంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నయనతార.. బాలకృష్ణ సరసన సింహా చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నమిత, స్నేహా ఉల్లాల్ కూడా చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu