»   » ప్రభుదేవాతో రిలేషన్ ఒప్పుకున్న నయనతార

ప్రభుదేవాతో రిలేషన్ ఒప్పుకున్న నయనతార

Posted By:
Subscribe to Filmibeat Telugu

నేను ప్రభుదేవా పేరును చేతి మీద పచ్చ పొడిపించుకుంటే మిగిలినవాళ్లకి కలిగిన ఇబ్బందేమిటో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు...అంటూ ఒక్కసారిగా నయనతార మండిపడింది. ప్రభుదేవాతో తన రిలేషన్ నిజమేనని ఒప్పుకుంటున్నట్లుగా ఆమె స్టేట్ మెంట్ ఇచ్చింది. ఆమె మీడియాతో ఈ విషయమై మాట్లాడుతూ..నలుగురూ నాలుగు రకాలుగా అనుకుంటారని వాళ్లందరి దగ్గరకూ వెళ్ళి నచ్చజెప్పుకోవడం సాధ్యం కాదు కదా. నేను నా కోసం బతుకుతున్నాను.అలాగే నేను ఎవరినైనా ఇష్టపడితే వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతాన అంది. గత కొద్ది నెలలుగా ప్రభుదేవా, నయనతారల మధ్య ఏదో నలుగుతోందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇద్దరూ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు.

అయితే తాజాగా జరిగిన సంఘటనలు, వీరిద్దరూ కలిసి తిరిగటం చూసిన వారు ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఇక ఈ నెల 6న తమిళ సినీ పరిశ్రమ కరుణానిధిని ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో నయన్‌, ప్రభుల జంట ఓ పాటకు నృత్యం చేసి ఆహుతులను అలరించింది. అప్పట్నుంచి వారిద్దరు కలిసే తిరుగుతున్నారు. షారూఖ్, కాజల్ ల లేటెస్ట్ చిత్రం 'మై నేమ్‌ ఈజ్‌ ఖాన్‌' చిత్రాన్ని చెన్నైలో కలిసి చూశారు. ప్రేమికుల రోజు నాడు ప్రభుదేవా ఆమెకు స్టార్ హోటల్ కి తీసుకెళ్ళి కాండిల్‌ లైట్‌ డిన్నర్‌ రుచి చూపించాడు. అంతేగాక అందరి ఎదురుగానే విలువైన బహుమతులను ఇచ్చిపుచ్చుకున్నారు. ఇక ఇప్పుడు నయనతార దాయటమెందుకు అనుకుందో ఏమో రిలేషన్ నిజమేనన్నట్లు బయిటపడింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu