»   » షాక్ :అనుష్క,నయనతార...బ్లాక్ ని వైట్ చేయమంటూ నిర్మాతలతో??

షాక్ :అనుష్క,నయనతార...బ్లాక్ ని వైట్ చేయమంటూ నిర్మాతలతో??

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ..పెద్ద నోట్ల రద్దు , తదనంతర పరిణామాలు మనం రోజూ వింటున్నాం, చూస్తున్నాం. అయితే ఈ రద్దు ప్రభావం మిగతా రంగాలపై ఏ మేరకు పడిందనేది ప్రక్కన పెడితే సినిమా పరిశ్రమపై మాత్రం ఇనిస్టెంట్ గా ఎఫెక్ట్ చూపిస్తోంది. హీరో,హీరోయిన్స్ , పూర్తి బిజీగా ఉండే క్యారక్టర్ ఆర్టిస్ట్ లు ఈ రద్దు తో సతమతమవుతున్నారు.

చిరంజీవి-పవన్ కళ్యాణ్ దత్తన్న కూతురు పెళ్లి వేడుకలో (ఫోటోస్ కోసం క్లిక్ చేయండి)

తమ దగ్గర ఇబ్బడి ముబ్బడిగా ఉన్న బ్లాక్ ని వైట్ చేసే పనిలో ఇప్పటికే చాలా మంది నటీనటులు బిజిగా ఉన్నారని రూమర్స్ వినపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో తెలుగు,తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్స్ గా వెలుగుతున్న నయనతార, అనుష్క ఈ రద్దుతో చాలా ఇబ్బందులు పడుతున్నట్లుగా చెప్పుకుంటున్నారు. ఈ విషయమై మీడియాలో కథనాలు సైతం వస్తున్నాయి.

ముఖ్యంగా తమ రెమ్యునేషన్స్ కు పన్ను చెల్లించి వైట్ మనీగా చేయండని నయనతార,అనుష్కలు నిర్మాతలపై వత్తిడి చేస్తున్నారన్న ప్రచారం తమిళ చిత్ర పరిశ్రమలో హల్‌చల్ చేస్తోంది.

అఫీషియల్ లెక్కలు

అఫీషియల్ లెక్కలు

ఈ విషయమై ఈ హీరోయిన్స్ ఇద్దరూ తమకు అంతంత రెమ్యునేషన్స్ ఇచ్చిన నిర్మాతలను కలిసి తమకు ఇచ్చిన రెమ్యునేషన్స్ లెక్కలు వైట్ లో చూపించి, తమ దగ్గర ఉన్న డబ్బుని వైట్ చేసేలా చేయమని కోరుతున్నారట. తమకు అంతకి మించి వేరే దారి లేదు అని చెప్తున్నారట.

ఉన్న తలనొప్పి చాలకనా

ఉన్న తలనొప్పి చాలకనా

కానీ నిర్మాతలు తమ సమస్యల్లో తాము ఉంటే ..కొత్తగా ఈ తలనొప్పి ఏంటిరా దేముడా అని తలపట్టుకుంటున్నారట. ఎందుకంటే తమ దగ్గర సినిమాల తీసి కోసం పెట్టుకున్న డబ్బు నిర్మాతల వద్ద ఉంది. దాన్ని ఎలా వైట్ చేయాలా అని ఆలోచిస్తూంటే ఈ కొత్త తలనొప్పి ఏంటిరా అని బాధపడుతున్నారట. అలాగని తమ హీరోయిన్స్ అడిగితే కాదనిలేని పరిస్దితి.

హీరోల లాగానే

హీరోల లాగానే

వీరిద్దరూ కెరీర్ ప్రారంభంలో ఎలా ఉన్నా ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటిస్తూ తన రెమ్యునేషన్స్ ని పెంచుకుంటూ పోయారు. వాళ్ళకు క్రేజ్ పెరగటమే తప్ప తరగటం లేకపోవటంతో నిర్మాతలు అదే స్దాయితో వారికి పేమెంట్స్ ఇస్తూ వస్తున్నారు. దాంతో హీరోల మాదిరిగానే వీరికి కూడా కొంత వైట్, మరికొంత బ్లాక్ ఇచ్చారని సమాచారం. వైట్ తో సమస్య లేదు లెక్క తేలుతుంది. బ్లాక్ తో ఇప్పుడు వైట్ చేసుకోవాల్సిన సిట్యువేషన్ వచ్చింది.

చిరంజీవినే కాదంది

చిరంజీవినే కాదంది

ఇటీవల నయనతార.. సూపర్‌ స్టార్ స్థాయికి చేరుకుని మూడు కోట్ల పారితోషికం పుచ్చుకుంటున్నట్లు తెలిసింది.అంతే కాదు తెలుగులో చిరంజీవి 150 వ చిత్రంలో నటిచండానికి మూడున్నర కోట్లు ఆఫర్ ఇచ్చినట్లు కోలీవుడ్ వర్గాల టాక్.అయినా ఆ అవకాశాన్ని త్రోచి పుచ్చారట.

హీరోయిన్ ఓరియెంటడ్ కావటంతో..

హీరోయిన్ ఓరియెంటడ్ కావటంతో..

అంతేకాకుండా ప్రస్తుతం నయనతార హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు ఆమె చేస్తున్న దోర,అరమ్,ఇమైక్కా నోడిగళ్,కొలైయుధీర్ కాలం మొదలగు చిత్రాలన్నీ హీరోయిన్ ఓరియన్‌టెడ్ చిత్రాలే. వీటిలో ప్రముఖ హీరోలంటూ ఎవరూ లేక పోవడంతో నయనతారకు అధిక పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు వెనుకాడటం లేదు.

భాగమతికి ఎంతంటే..

భాగమతికి ఎంతంటే..

ఇక నయనతార తరువాత సౌత్ లో అధిక పారితోషికం తీసుకుంటున్న నటి అనుష్కనే.ఆమె రెమ్యునేషన్ అరుంధతి చిత్రానికి ముందు,ఆ తరువాతగా మారిపోయింది. అనుష్క రెండు కోట్లు పారితోషికం వసూలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం తను నటిస్తున్న హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం ..బాగమతికి రెండున్నర కోట్లు పుచ్చుకున్నట్లు టాక్.

ఒక్కసారిగా కంగారుపడి

ఒక్కసారిగా కంగారుపడి

ప్రధాని నరేంద్రమోది పెద్ద నోట్లను రద్దు చేయడంతో భారీ పారితోషికాలు పుచ్చుకుంటున్న నయనతార,అనుష్క వంటి స్టార్స్ ఒక్క సారిగా కంగారుపడి ఆనక సర్దుకునే ప్రయత్నాల్లో పడ్డట్టు సమాచారం. వీళ్లిద్దరూ తాము బ్లాక్ గా తీసుకున్న రెమ్యునేషన్ ని వైట్ చేసుకోకపోతే సమస్యల్లో ఇరుక్కుంటామని భావిస్తున్నారట.

నిర్మాతలకు ఇబ్బందే

నిర్మాతలకు ఇబ్బందే

దీంతో తాము నటిస్తున్న చిత్రాల నిర్మాతలను తన రెమ్యునేషన్స్ కు పన్ను కట్టి వైట్ మనీ చేసి పెట్టమని వత్తిడి తీసుకొస్తునట్లు దీంతో నిర్మాతలు ఇబ్బందులకు గురవుతున్నట్లు తమిళ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

English summary
After PM Modis surgical strike on black money, Nayanthara and Anushka reportedly want their salary after deducting tax.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu