»   » అందుకే ఏడ్చేసాను: నయనతార

అందుకే ఏడ్చేసాను: నయనతార

Posted By:
Subscribe to Filmibeat Telugu

'శ్రీరామరాజ్యం'షూటింగ్‌ ఆఖరి రోజున నయనతార కన్నీళ్లు పెట్టుకొంటూ వీడ్కోలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ సంఘటనను తలుచుకొంటూ నయనతార అంత బాధ రావటానకి కారణం వివరించింది. ఆమె మాటల్లోనే...''ఆ యూనిట్ తో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. నన్ను చాలా గౌరవంగా చూసుకొన్నారు. అందుకే వాళ్లను విడిచి వెళ్లాలనగానే దుఃఖం పొంగుకొచ్చింది. నన్ను నేను అదుపు చేసుకోలేకపోయాను అంది. అలాగే దర్సకుడు గురించి మాట్లాడుతూ..మనకున్న గొప్ప దర్శకుల్లో బాపు ఒకరు. ఆయన సీత పాత్రకు నన్ను ఎంచుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఆయనను మెప్పించాననే నమ్మకం ఉందని చెప్పింది. సినిమా గురించి చెబుతూ..''ఇది వరకు రామాయణం చదివాను. ఆ కథతో ఓ సినిమా తీస్తే, అందులో నాకు సీత పాత్ర దక్కుతుందని ఎప్పుడూ అనుకోలేదు అంది.

English summary
Nayantara breaks down on last day shooting of 'Sri Rama Rajyam'. Nayan couldn't control herself when the unit members.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu