»   » నేను గర్భవతిని కాదు...కేసు వేస్తా: నయనతార

నేను గర్భవతిని కాదు...కేసు వేస్తా: నయనతార

Posted By:
Subscribe to Filmibeat Telugu

"నేను నెలా తప్పలేదు..వారం తప్పలేదు...సంవత్సరం తప్పలేదు..! ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నారో అర్థం కావడంలేదు. నాకు ఎవరెవరితోనో సంబంధాలున్నాయని ఒకళ్లు రాస్తారు. నేను ఫలానా వ్యక్తిని పెళ్లాడాలనుకుంటున్నానని మరొకరు రాస్తారు. అసలు పెళ్లి చేసేసుకున్నానని ఇంకొకరు రాస్తారు అంటూ వాపోతోంది నయనతార. ఇటీవల 'బాస్‌ ఎన్గీరన్‌ భాస్కరన్‌' చిత్రం షూటింగ్ ‌లో నయనతార కళ్లు తిరిగిపడిపోయారని, ఆమె గర్భవతి కావడంవల్లే ఇలా జరిగిందని కొన్ని వార్తలు మీడియాలో వచ్చాయి. దాంతో తీవ్ర స్థాయిలో స్పందించారు నయనతార. ఆమె మీడియాపై మండిపడుతూ...వాళ్లు రాస్తున్నది కరెక్ట్‌ సమాచారమో..కాదో వారికే అర్థం కావడం లేదు. డైటింగ్‌ చేయడం వల్ల, పని వత్తిడి వల్ల ఒక్కోసారి కళ్లు తిరిగిపడిపోవడం జరుగుతుంది. కాస్త నలతగావుండి నేను పడిపోతే...నెలతప్పానని న్యూస్‌ రాయడం ఏమైనా బాగుందా?? మరోసారి ఇలాంటి రాతలకు పాల్పడితే..చట్టపరమైన చర్య తీసుకోవాల్సి ఉంటుంది..కేసు వేస్తాను' అని విరుచుకు పడింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu