నయనతార చిత్రాలు బ్యాన్?
నయనతార,ప్రభుదేవా వ్యవహారం ముదిరి పాకాన పడుతోంది. ప్రభుదేవా భార్య రామలత ఇప్పటికే నయనతారని కలసి తన కాపురంలో నిప్పులు పోయిద్దని వేడుకుంది..అనంతరం గొడవ చేసింది. అయితే ప్రభుదేవా,నయనతార ఇద్దరూ ఈ విషయాలు లెక్కచేయకపోవటంతో ఆమె ఈ విషయాన్ని మహిళా సంఘాల దృష్టికి తీసుకెళ్ళింది. దాంతో వారు కూడా నయనతారకి తమదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. అయితే అది కూడా లెక్కచేయకపోవటంతో వారు ఆమె సినిమాలను తమిళనాడులో రిలీజ్ కాకుండా చేయాలని నిర్ణంయించుకున్నట్లు సమాచారం. అదే జరిగితే మొన్నీ మధ్యే నిర్మాతల మండలి నుండి బ్యాన్ ఎదుర్కొన్న ఆమె కిది పెద్ద తలనొప్పే అంటున్నారు. అయితే ఇవన్నీ ఇలా జరుగుతూంటే్ నయనతార మాత్రం తానూ ప్రభుదేవా భార్య మంచి స్నేహితురాళ్లమని కావాలనే ఈ రూమర్స్ పుట్టించి తమ మధ్య గొడవలు పెట్టడానికే ట్రై చేస్తున్నారంటూ చిలకపలుకులు పలుకుతోంది. ఇక విజయ్ హీరోగా చేసిన విల్లు చిత్రం నుండీ ప్రభుదేవా, నయనతారల మధ్య ఈ రిలేషన్ నెలకొంది. ప్రస్తుతం నయనతార నటించిన మల్లికా ఐ లవ్ యు చిత్రం రిలీజ్ కు సిద్దంగా ఉంది. అలాగే ఎన్టీఆర్ సరసన ఆమె అదుర్స్ చిత్రంలో చేస్తోంది. మొన్నీ మధ్యన రవితేజ సరసన చేసిన ఆంజనేయులు భాక్సాఫీసు వద్ద నెగిటివ్ రిజల్ట్ తెచ్చిపెట్టింది.


Click it and Unblock the Notifications











