»   »  'క్లియోపాత్ర' గా నయనతార!!!

'క్లియోపాత్ర' గా నయనతార!!!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Nayantara
జగదేక సుందరిగా పేరుగాంచిన క్లియోపాత్ర గా త్వరలో నయనతార కనిపంచబోతోంది. ఆ సినిమా మరేదో కాదు నిన్ననే ఆడియో పంక్షన్ జరుపుకున్న 'కథానాయకుడు'. రజనీకాంత్,జగపతిబాబు హీరోలుగా చేస్తున్న ఈ సినిమాలో నయనతార ఓ పాటలో ఈ గెటప్ లో కనిపిస్తుంది. అందిన విశ్వశనీయ సమాచారం ప్రకారం సినిమాలో రెండు పాటల్లో ఆమె నర్తించనుంది. అందులో క్లియోపాత్రగా కనపడే పాటే హైలట్ అవుతుందని యూనిట్ వర్గాలు భావిస్తున్నారు.

ఇక రెండో పాటలో వర్షంలో ఉంటుందని అందులో ఆమె చాలా ఎక్స్ పోజింగ్ చేసిందనీ ,రజనీ వంటి నటుడే దానికి షాక్ అయ్యాడని చెన్నై లో చెప్పుకుంటున్నారు. గతంలో 'భిల్లా' లో బికినీతో కనపడి అవర వాళ్ళకి కిక్కిచ్చిన ఈమె ఇప్పుడు అంతకు మించి అందాలు ఆరబొయ్యకపోతే తేలిపోతుందని పి.వాసు భావించాడని,దానికి నయనతార కూడా ఏకీభవించి సరేనని ఇలా కనువిందు చేస్తోందని చెప్పుకుంటున్నారు. చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లు నయనతార ఇప్పుడు సౌత్ లో హాట్. దాంతో ఆమె యోంచేసినా అద్భుతంగా ఉంటుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X