నిన్న ఓ చేదు జ్ఞాపకం: నయనతార
అలాగే ''నేను నటించిన సినిమా పరాజయం పొందితే... ఒక్క నిమిషం బాధపడతానంతే. వెంటనే మరో పనిలో పడిపోతాను. జీవితంలో తిన్న ఎదురు దెబ్బలు నిమిషాల్లో మర్చిపోలేంగానీ... కోలుకోవడానికి సమయం పడుతుంది. ప్రేమపై నాకు ఇప్పటికీ గౌరవం ఉంది. నా కోసం ఎవరో ఒకరు పుట్టే ఉంటారు'' అంటోంది. ప్రస్తుతం నయనతార తెలుగులో నాగార్జున, దశరథ్ కాంబినేషన్ లో ఓ చిత్రం కమిటైంది. అదికాక క్రిష్ దర్శకత్వంలో రానా హీరోగా రూపొందుతున్న కృష్ణం వందే జగద్గురంలోనూ ఆమె హీరోయిన్ గా చేస్తోంది. మరో రెండు తమిళ సినిమాలు సైతం ఆమె కమిటైంది. బాలకృష్ణ కూడా తను డైరక్ట్ చేద్దామనుకున్న నర్తన శాలలో ఆమెను హీరోయిన్ గా అడుగుతున్నాడు.
ఇక నయనతార గొంతు త్వరలో తెలుగు తెరపై వినపడనుంది. నయనతార,రానా కాంబినేషన్ లో రూపొందుతున్న 'కృష్ణంవందే జగద్గురుమ్' సినిమా కోసం నయనతార తన గొంతును సవరించింది. ఆమె తెలుగులో డబ్బింగ్ చెప్పడం ఇదే ప్రథమం. ఇందులో నయన పాత్ర పేరు దేవిక. డాషింగ్ జర్నలిస్ట్. ఈ పాత్రకు నయనతారే డబ్బింగ్ చెబితే బావుంటుందని ఆ చిత్ర దర్శకుడు క్రిష్ భావించడంతో... నయన ఉత్సాహంతో తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టేశారు.
దర్శకుడు క్రిష్ తన చిత్రంలో నయనతార పాత్ర గురించి మాట్లాడుతూ.....''నా సినిమాల్లో హీరోయిన్ పాత్రకూ ప్రాముఖ్యం ఉంటుంది. 'గమ్యం'లో జానకి, 'వేదం'లో సరోజ పాత్రలు కథను ముందుండి నడిపించాయి. ఈ సినిమాలోనూ అలాంటి పాత్రే ఉంది. నయనతార దేవికగా కనిపిస్తుంది. బీటెక్ బాబు మాస్ అయితే దేవిక క్లాస్. డాక్యుమెంటరీలు తీస్తుంటుంది. వీరిద్దరి సంబంధం ఏమిటో తెరపై చూస్తేనే బాగుంటుంది''అన్నారు.


Click it and Unblock the Notifications












