»   » భయపెడుతోంది: నయనతార హారర్ మూవీ ‘మాయ’ (ట్రైలర్)

భయపెడుతోంది: నయనతార హారర్ మూవీ ‘మాయ’ (ట్రైలర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నయనతార ప్రధాన పాత్రలో తమిళంలో తెరకెక్కుతున్న హారర్ మూవీ ‘మాయ'. అశ్విన్ శరవనణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగు, మళయాలంలోకి డబ్ చేసి విడుదల చేయనున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ విడుదలైంది.

నయనతార గత చిత్రాలకు భిన్నంగా పూర్తి హారర్ కాన్సెప్టుతో ఈచిత్రం సాగుతుంది. దయ్యాల కాన్సెప్టుతో తెరకెక్కిన ఈచిత్రం ట్రైలర్ భయ పెట్టే విధంగా ఉంది. ప్రస్తుతం తమిళ వెర్షన్ ట్రైలర్ మాత్రమే విడుదలైంది. త్వరలో తెలుగు వెర్షన్ ట్రైలర్ కూడా విడుదల చేయనున్నారు.

అశ్విన్ శరవణన్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో ఆరి ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ‘అనామిక' తర్వాత నయనతార నటిస్తున్న ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా ఇది. పోటెన్షియల్ స్టూడియోస్ పతాకంపై ప్రభు నిర్మిస్తున్న ఈ సినిమాపై తమిళ ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉన్నాయి. నయనతార ఉండటంతో తెలుగులోనూ మంచి బిజినెస్ అవుతుందని భావిస్తున్నారు.

Nayantara Maya Official trailer

ప్రస్తుతం హారర్ చిత్రాల ట్రెండ్ నడుస్తోందన్నది పరిశ్రమ వర్గాల మాట. ఆ మధ్య వచ్చిన పిజ్జా, విల్లా, యామిరుక్కభయమే, ఆ, పిశాచు లాంటి చిత్రాల నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టాయి. ఈమధ్య తెలుగులో రూపొందిన గీతాంజలి లాంటి చిత్రాలు కాసులు తెచ్చిపెట్టాయి. దీంతో ఈ తరహా హార్రర్ చిత్రాల నిర్మాణాల సంఖ్య పెరుగుతోందనే చెప్పాలి. తాజాగా నటినయనతార మాయ చిత్రంతో భయపెట్టడానికి రెడీ అవుతున్నారు.

English summary
Maya is an upcoming supernatural horror film starring Nayanthara and Aari. Written and Directed by Ashwin Saravanan. Produced by Potential Studios.
Please Wait while comments are loading...