»   » నేను తప్పు చేయననే నమ్మకం: నయనతార

నేను తప్పు చేయననే నమ్మకం: నయనతార

Posted By:
Subscribe to Filmibeat Telugu

నేను తప్పు చేయననే నమ్మకం మావాళ్లకి ఉంది. కాబట్టి వాళ్లు హ్యాపీగా ఉన్నారు అంటోంది నయనతార. మీ మీద రకరకాల రూమర్స్ వస్తూంటాయి కదా మరి మీ కుటుంబం వాళ్ళు మిమ్మల్ని అడగరా అంటే...ఆమె పై విధంగా స్పందించింది. అలాగే పిల్లల మీద వదంతులు వస్తే ఏ తల్లి, తండ్రికి బాధగా ఉండదు? మొదట్లో మావాళ్లు కూడా కొంచెం కంగారు పడ్డారు. శింబూతో ఎఫైర్‌ అట కదా? ప్రభుదేవాని పెళ్లి చేసుకున్నారట? అని మీడియా నన్ను చాలాసార్లు ప్రశ్నించటం వారికి భాధ కలిగించింది అంటోందామె. ఇక తనకు తన వ్యక్తిగత జీవితం గురించి ఎవరికీ వివరణ ఇవ్వాలని అనిపించలేదంటోంది. అందుకనే మీడియా వారితో 'నో కామెంట్స్‌' అంటున్నాను. కానీ కనిపించినస మా అమ్మా నాన్నకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. రూమర్స్ ను నమ్మొద్దని వాళ్లకి వివరించాను అంది. ప్రస్తుతం నయనతార తెలుగులో బాలకృష్ణ సరసన 'సింహా' చిత్రంలో, తమిళ్‌లో ఆర్యకి జతగా 'బాస్‌ ఎన్‌ గిర భాస్కరన్‌', మలయాళంలో హీరోయిన్‌ ఓరియంటెడ్‌ ఫిల్మ్‌ 'ఎలక్ట్రా', కన్నడంలో ఉపేంద్ర పక్కన 'సింబల్‌' చిత్రాల్లో చేస్తోంది. ఆమె హీరోయిన్ గా చేసిన ఎన్టీఆర్ అదుర్స్ చిత్రం సంక్రాంతికి రిలీజై హీట్టయింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu