»   » ఏం చేస్తాం...చేతులు కాల్చుకుంటున్నా: నయనతార

ఏం చేస్తాం...చేతులు కాల్చుకుంటున్నా: నయనతార

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్టార్ హీరోయిన్ నయనతార ఈ మధ్య ఇంట్లో వంట చేయాలని పూనుకుంది. అయితే ఆమె చెయ్యకాలింది కానీ వటం మాత్రం పూర్తి కాలేదుట. ఈ విషయాన్ని ఆమె చెబుతూ. "నాకు వంటలు చేయడం రాదు. రెండు మూడు సార్లు ప్రయత్నించినా చేతులు కాల్చుకోవడం తప్ప పెద్దగా ఒరిగింది ఏమీ లేదు. మా బంధువులేమో అమ్మాయికి వంటలు నేర్పించకపోతే ఎలా? అనేవారు. నేను చదువుకుంటున్న రోజుల్లో...మా అమ్మ నాకు పూర్తి మద్దతిచ్చేది. ఆమె ఎప్పుడూ 'నాకూతురుకేంటి చక్కగా వంట మనిషిని పెట్టుకుంటుంది' అనేది. ఆమె అన్న మాటలు ఇవాళ నిజమయ్యాయి. నేనూ ఓ స్థాయిలో ఉన్నాను. భవిష్యత్తులో వంటింట్లోకి వెళ్ళే అవసరం రాదు అని అనను కానీ ఇప్పుడా అవసరం లేదు. కన్నతల్లి ఆశీస్సులు ఊరికే పోవన్న మాటను నేను బాగా నమ్ముతాను. అన్నట్టు నాకు ఉత్తరాది వంటకాలన్నీ ఇష్టం. దక్షిణాది వంటకాల్లో చేపల వెరైటీలను మాత్రం ఇష్టపడి తింటాను" అంటూ చెప్పుకొచ్చింది నయనతార. ఆమె నటించిన అదుర్స్ సినిమా సంక్రాంతికి విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. అలాగే ఆమె ప్రస్తుతం బాలకృష్ణ సరసన సింహా చిత్రంలోనూ, కన్నడంలో ఉపేంద్ర సరసన ఓ చిత్రంలో నటిస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu