»   » ఆర్య, నయనతార పేరుతో మోసం చేసారు

ఆర్య, నయనతార పేరుతో మోసం చేసారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రంగురంగుల సినిమా ప్రపంచంలో చీకటి కోణాలు ఎన్నో. ఎందరో అమాయకులు సినీ మాయగాళ్లు చెప్పే మాటలు నమ్మి మోసపోయిన సందర్భాలు అనేకం. సినిమాలపై మోజుతో ఈ రంగంలో అడుగు పెట్టిన వారిని తమకు పలువురు స్టార్లతో పరిచయం ఉందంటూ... నిర్మాతగానో, దర్శకునిగానో, నటుడిగానో అవకాశం ఇప్పిస్తామంటూ డబ్బులు గుంజుతూ ఉంటారు.

తాజాగా నయనతార, ఆర్య పేర్లను వాడుకుని మోసానికి పాల్పడిన విషయం వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని కోయంబత్తూరు నాగరాజపురానికి చెందిన శివానందం, కేరళలోని తిరుచూర్‌కు చెందిన బాబు కలసి చిత్రం నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం కాళియముత్తూర్‌లో చిత్ర నిర్మాణ కార్యాలయాన్ని నెలకొల్పారు. వీరి మాటలు నమ్మి బాలమురుగన్, కార్తిక్‌రాజన్, మోహన్ సుందర్ అనే మరో ముగ్గురు భాగస్వామ్యులుగా చేరారు.

Nayanthara, Aarya names misuse

బాబు తమను మోసం చేస్తున్నట్లు శివానందంకు సందేహం కలిగింది. దీంతో తను ఇచ్చిన రెండు లక్షలు తిరిగి ఇచ్చేయాలని తానీ చిత్ర నిర్మాణం నుంచి వైదొలుగుతానని బాబుతో చెప్పారు. అందుకు బాబు అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మోహన్ సుందరం, శివానందంపై దాడి చేసినట్లు సమాచారం. శివానందంలో వచ్చిన పాండియన్, మోహన్, సుందరంలపై తిరగబడడంతో వ్యవహారం పోలీసుస్టేషన్ వరకు వెళ్లింది. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది.

English summary
Tamil film actors Nayanthara, Aarya names misuse.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu