»   » అనుష్క ప్లేసులో నయనతార, మరోసారి దెయ్యం భయపెట్టబోతోందా?

అనుష్క ప్లేసులో నయనతార, మరోసారి దెయ్యం భయపెట్టబోతోందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మాయ, డోర, కాష్మోరా లాంటి హారర్ చిత్రాల్లో నటించిన హీరోయిన్ నయనతార త్వరలో మరో దెయ్యం మూవీలో ప్రేక్షకులను భయపెట్టడానికి రాబోతోందా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. హిందీలో సూపర్ హిట్ అయిన హారర్ మూవీ 'పరి' తమిళంలో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ప్రముఖ తమిళ ప్రొడ్యూసర్ 'పరి' రీమేక్ హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. హిందీలో అనుష్క శర్మ పోషించిన పాత్రను తమిళంలో నయనతారతో చేయించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు ఆమెతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Nayanthara in Anushka’s Pari remake?

హారర్ సినిమాలు నయనతారకు కొత్తేమీ కాదు. గతంలో ఆమె మాయ, డోర చిత్రాల ద్వారా ప్రేక్షకులను భయకంపితులను చేసింది. 'పరి' రీమేక్‌లో ఆమె అయితేను కరెక్ట్ అయిన తమిళ నిర్మాతలు భావిస్తున్నారు. త్వరలోనే దీనిపై అఫీషియల్ సమాచారం వెలువడే అవకాశం ఉంది. అదే నిజం అయితే తెలుగులో కూడా దీన్ని అనువాదం చేసి విడుదల చేయనున్నారు.

ప్రస్తుతం నయనతార హైదరాబాద్‌లో జరుగుతున్న 'సైరా నరసింహారెడ్డి' షూటింగులో బిజీగా ఉన్నారు. చిరంజీవి, నయనతార, అమితాబ్ తదితరులపై ఇటీవల కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

English summary
Speculation is rife that Nayanthara has been approached for the Tamil remake of Bollywood movie Pari: Not a Fairytale, a supernatural horror thriller, which had Anushka Sharma in the lead. Now, we hear that a big K’town producer has bought the remake rights of Pari and he wants Nayanthara on board to reprise Anushka’s role.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X