»   » అరిచేతిలో నిజం పాముతో నయనతార (ఫొటో)

అరిచేతిలో నిజం పాముతో నయనతార (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: నయనతార అరచేతిలో పాము ని పట్టుకుని భయం లేకుండా దాని వంక చూస్తూండటంతో సెట్ లో అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు ఆ పాముకి బాబు అనే పేరు పెట్టింది. ఇదంతా Idhu Kathirvelan Kaadhal అనే చిత్రం షూటింగ్ లో జరిగింది. కోయంబత్తూరు షూటింగ్ లో భాగంగా పాముతో ఆమె ఈ విన్యాసం చేసింది. అంతా ఆమె భయపడుతుందనుకుంటే ఆమే పాముతో ఆడి భయపెట్టింది.

ఇక మొన్నీ మధ్యనే గ్రీకు వీరుడుతో కలిసి తెలుగువారిని పలకరించిన నయనతార త్వరలో...శేఖర్ కమ్ముల అనామిక చిత్రంలో కనిపించి అలరించనుంది. బాలీవుడ్ మూవీ 'కహానీ'కి రీమేక్ గా రూపొందుతున్న చిత్రానికి సైన్ చేసిన సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలుగు/తమిళంలో ఒకేసారి రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో సాగుతోంది. ఇందులో ఆమె 'అనామిక' పాత్రలో కనిపించనుంది.

Nayanthara

ఎండర్ మోల్ ఇండియా, లాగ్ లైన్ ప్రొడక్షన్స్, సెలక్ట్ మీడియా హోల్డింగ్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కహానీ చిత్రం కోల్ కతా బ్యాక్ డ్రాప్‌తో సాగుతుంది. అయితే ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగిన విధంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీ నేపథ్యాన్ని ఎంచుకున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల.

ఈ చిత్రానికి ప్రముక నావెలిస్ట్ యండమూరి వీరేంద్రనాధ్ ఈ చిత్రానికి సహాయ రచయితగా పని చేస్తున్నారు. విజయ్ సి. కుమార్ సినిమాగ్రఫీ చేయనున్నారు. సినిమా కథ విషయానికొస్తే... కనిపించకుండాపోయిన తన భర్త గురించి ఒక ఎన్ ఆర్ ఐ గర్భిణి చేసే అన్వేషణే ఈ కహానీ చిత్ర కథ. అనేక హాలీవుడ్ సినిమాల స్ఫూర్తి‌తో చేసిన ఈ సినిమా హిందీలో ఘన విజయం సాధించడంతో తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు దర్శక నిర్మాతలు.

English summary
Nayanthara seems to be having a lot of fun on the sets of S.R.Prabhakaran’s Idhu Kathirvelan Kaadhal. During their current schedule in Coimbatore, Nayanthara was seen handling and playing with a small snake without any fear.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu