»   » హీరోపై మండిపడుతున్న నయనతార

హీరోపై మండిపడుతున్న నయనతార

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : 'నయనతార నా అదృష్ట దేవత' అన్నందుకు ఆర్యపై నయన్‌ కారాలు మిరియాలు నూరుతోందట. 'బాస్‌ ఎన్గిర భాస్కరన్‌' విజయవంతం కావటంతోపాటు అందులో ఆర్య - నయనతార జంటపై ప్రశంసలు కురిశాయి. ఇటీవల మళ్లీ వారి కాంబినేషన్లో వచ్చిన 'రాజారాణి' కూడా ఘన విజయం సాధించింది. ఈ చిత్రీకరణ సందర్భంగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగినట్లు కూడా వార్తలొచ్చాయి. అయితే ప్రేమ వ్యవహారాలకు సంబంధించి ఇప్పటికే తలనొప్పితో ఉన్న నయనతారకు ఈ వార్తలు మరింత చికాకు తెప్పించాయట.

పుండుమీద కారం చల్లినట్లు ఇటీవల ఆర్య చేసిన వ్యాఖ్యలు ఆమెకు మరింత కోపాన్ని రేపాయట. ఆర్య ఇటీవల 'రాజారాణి' విజయాన్ని ప్రస్తావిస్తూ నయనతార తన అదృష్ట దేవత అని ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలు వదంతులకు మరింత వూతమిస్తాయనే భావనకొచ్చిందట నయనతార. దీంతో ఆర్యపై కారాలు మిరియాలు నూరటంతోపాటు తన సన్నిహితుల వద్ద ఇదే విషయాన్ని ప్రస్తావించి వాపోతోందట.

Nayanthara fire on arya

ఇక నయనతార తాజా చిత్రం అనామిక విషయానికి వస్తే...సగటు ఇల్లాలు... అనామిక. ఆమెకి భర్త, ఇల్లే లోకం. సరదాగా సాగిపోతున్న ఆమె కాపురంలో ఉన్నట్టుండి ఓ అలజడి. తన భర్త ఎక్కడో తప్పిపోయాడు. ఎటు వెళ్లాడో, ఎలా వెళ్లాడో తెలియదు. ఎంత ఎదురు చూసినా ఫలితం లేదు. దీంతో తనే భర్త కోసం అన్వేషణ మొదలుపెట్టింది. హైదరాబాద్‌ పాతబస్తీకి చేరుకొంది. ఎదురు పడిన ప్రతీ ఒక్కరినీ 'నా భర్త జాడ చెప్పరూ' అంటూ వేడుకొంటోంది. మరి అనామిక భర్త దొరికాడా? లేదా? తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు శేఖర్‌ కమ్ముల. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అనామిక'.

నయనతార ప్రధాన పాత్రలో నటించింది. వైభవ్‌, హర్షవర్ధన్‌ రాణే కీలక పాత్రలు పోషించారు. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. దర్శకుడు మాట్లాడుతూ ''ప్రస్తుత సమాజాన్ని ప్రతిబింబించే కథ ఇది. భర్త జాడ కనుక్కొనేందుకని బయటికి వచ్చిన ఓ మహిళకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనేది ఆసక్తికరం.

హిందీ 'కహానీ' ఆధారంగా రూపొందిన చిత్రమే అయినా... మన వాతావరణానికి తగ్గట్టుగా కథలో మార్పులు చేశాం. ఇందులోని భావోద్వేగాలు మనసుల్ని హత్తుకొనేలా ఉంటాయి. పాతబస్తీ ప్రాంతాన్ని కొత్తకోణంలో చూపించే ప్రయత్నం చేశాం'' అన్నారు. ఈ చిత్రాన్ని వయాకామ్‌ 18, ఐడెంటిటీ మోషన్‌ పిక్చర్స్‌, లాగ్‌లైన్‌ పిక్చర్స్‌ సంస్థలు కలిసి నిర్మించాయి.

English summary
It is being rumored that Aarya is having an affair with Nayanthara. The controversial actress who just recently came out of an affair with Actor Prabhu Deva is again on the news. Arya strongly denies this though, by saying that the actress is just a good friend of his.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu