»   » నయనతార కారుకి దెయ్యం పట్టిందిట, వెంటాడి వేధిస్తోందిట

నయనతార కారుకి దెయ్యం పట్టిందిట, వెంటాడి వేధిస్తోందిట

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : గతంలో ఆత్మ ఆవహించిన కారు కాన్సెప్టుతో తెలుగులో 'కారు దిద్దిన కాపురం' అనే సినిమా వచ్చి విజయవంతం అయ్యింది. ఇప్పుడు అలాగే..దెయ్యం పట్టిన కారుని మనం చూడబోతున్నాం. అయితే ఆ కారు ఎవరిదీ అంటే...నయనతార ది. దెయ్యం పట్టిన కారుతో నయనతార పడే తిప్పలే కథ అంటున్నారు. ఇంతకీ ఏ సినిమా గురించి నేను మాట్లాడుతున్నానో అర్దం కాకపోతే క్రింద మ్యాటర్ చదవండి మరి.

సినీ పరిశ్రమలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్న కొద్దీ విజయాలు అందుకుంటూ మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతోంది కేరళకుట్టి నయనతార. ఇటీవల హర్రర్‌, థ్రిల్లర్‌ కథాంశంతో రూపుదిద్దుకున్న 'మాయ'లో తన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు అదే తరహాలోని దెయ్యం కథతో రూపొందుతున్న 'డోరా'లో ఆమె నటిస్తోంది. దర్శకుడు సర్గుణం ఈ చిత్రానికి నిర్మాత. ఆయన సహాయకుడు దాస్‌ రామస్వామి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

Nayanthara is Dora now and the Car is Ghost

వివేక్‌ మెర్విన్‌ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా దినేష్‌కృష్ణన్‌ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ప్రస్తుతం నేపథ్య సంగీతానికి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి.

డోరా సినిమాలో దెయ్యం ఎవరనేది ఆసక్తికరంగా మారింది. నయనతారే ఆ పాత్రలో నటిస్తున్నట్లు ఇటీవల వార్తలొచ్చాయి. అందులో వాస్తవం లేదని తాజా సమాచారం. ఈ చిత్రంలో కారే దెయ్యమట. అందులో వెళ్లిన ఆమె ఎదుర్కొనే సమస్యలు... ఆ తర్వాత తెలుసుకున్న కొన్ని నిజాలే ఆసక్తికరంగా ఉంటాయని తమిళ సిని వర్గాల సమాచారం. ఫిబ్రవరిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

English summary
Nayanthara’s next big release of 2017 Dora is getting ready for release. Dora is a fantasy crime thriller with horror elements . The buzz is that the car in the film plays an important role and is said to be the ghost .
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu