»   » హన్సిక నా ప్రియురాలు, నయనతార నా స్నేహితురాలు

హన్సిక నా ప్రియురాలు, నయనతార నా స్నేహితురాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : నయనతార, నేను కలిపి పనిచేయడం ఇష్టంలేని కొందరే ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారు. మీకు చాలా స్పష్టంగా చెప్పాలంటే హన్సిక నా ప్రియురాలు. నయనతార స్నేహితురాలు అంటూ చెప్పుకొచ్చారు తమిళ హీరో శింబు. నయనతార తో కలిసి నటించటం హన్సికకు ఇష్టం లేదంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో శింబు ఖండిస్తూ ఇలా చెప్పుకొచ్చారు. మా ప్రేమ వ్యవహారంలో నయనతారకు ఎలాంటి పాత్రా లేదు. హన్సిక మరో హీరోతో కలిసి నటించకూడదని నేననుకుంటే భావ్యమా..? అలాగే నయనతారతో నేను కలిసి నటించినా హన్సిక పట్టించుకోదు. అది మా వృత్తి మాత్రమే అన్నారు.

ఇక పెళ్లి చేసుకోబోయేది హన్సికనే కదా.. అంటే ఏదీ మన చేతిలో లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ప్రస్తుతం మేమిద్దరం ఇష్టపడుతున్నాం. అంతే. హన్సికతో 'వేట్టెమన్నన్‌'లో తొలిసారి కలిసి నటించాను. అప్పుడు కేవలం సినిమాకు సంబంధించిన విషయాలే మాట్లాడా. ఆమె ఫోన్‌నెంబర్‌ కూడా నా వద్ద లేదు. ఓ రోజు అనుకోకుండా మా మధ్య మాటలు కలిశాయి. అప్పటి నుంచి కొనసాగుతున్నాయి. ఈ ప్రయాణం ఎక్కడి వరకన్నది మాకూ తెలీదు అన్నారు.

 Nayanthara is my friend while Hansika is my lover

హన్సికతో కొన్ని కారణాల వల్ల ప్రేమకు బ్రేకులు పడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయనే వార్తపై స్పందిస్తూ... నేనెప్పుడూ బంధాలను దాచిపెట్టలేదు. వాటి ద్వారా వచ్చే సమస్యలనూ రహస్యంగా ఉంచలేదు. అందరూ అంటున్నట్లు మా ప్రేమ వ్యవహారం హన్సిక అమ్మకు నచ్చకపోతే.. మేమిద్దరం ఎలా కలుసుకోగలుగుతాం? అన్నారు.

పెళ్లి గురించి మాట్లాడుతూ... ఎందుకో తెలీదు... పెళ్లంటేనే నాకు కొంచెం విరక్తి కూడా. నా దృష్టిలో పెళ్లి చేసుకోవటమంటే జైలుకెళ్లటంలాంటిదే. ప్రేమ కూడా అంతే. వివాహంతో పోలిస్తే ఇది కాస్త నయం. ప్రేమ జైలులో మన తలుపు తాళం చెవి మన వద్దే ఉంటుంది. అనుకున్నప్పుడు బయటపడొచ్చు. అదే పెళ్లే విషయంలో అలా కుదరుదు. మరెవరో మనల్ని జైలులో బంధించి.. తాళం చెవిని కూడా వారి వద్దే ఉంచుకుంటారు. ఏమైనా నా పెళ్లి 19వ ఏటనే కావాల్సింది. ఇప్పటి వరకు వాయిదాపడుతూ వస్తోందంటే నాకు తగిన అమ్మాయే భార్యగా రావాలని రాసిపెట్టి ఉందేమో అన్నారు.

English summary
Simbhu mentioned, “Nayanthara has no role in the relationship between me and Hansika. I have no objections for Hansika to pair with any heroes. Similarly she also does not interfere with me. All those news are imaginary. Hansika is my lover while Nayanthara is my friend.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu