For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  శింబుపై కోపంతో నయనతార దగ్గుపాటి రాణాని..?

  By Srikanya
  |

  చెన్నై : దగ్గుపాటి రానా త్వరలో అజిత్ తమిళ చిత్రంలో అతిధి పాత్రలో కనిపించి అలరించనున్న సంగతి తెలిసిందే. అతని అతధి పాత్ర చేయటానికి నయనతార రికమండేషన్ కారణమని తెలుస్తోంది. నయనతార ఆ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. మొదట ఈ గెస్ట్ రోల్ కి గానూ శింబు ని అనుకున్నారు. కానీ నయనతారకు శింబుకు విభేధాలు ఉన్న కారణంగా రానా సీన్ లోకి వచ్చినట్లు తమిళ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో రానా, నయనతార కలిసి ఓ చిత్రంలో చేస్తున్నారు. రానా ని పెట్టుకోవటం ద్వారా తెలుగు మార్కెట్ కు కూడా వీలు ఉంటుందనేది కూడా ఓ కారణం అంటున్నారు.

  జయాపజయాలతో నిమిత్తం లేకుండా అజిత్‌ కోలీవుడ్‌లో స్టార్ హీరో గా కొనసాగుతన్నాడు. 'మంగాత్తా'లాంటి భారీ విజయం తర్వాత 'బిల్లా-2' నిరాశపర్చినా ఆయన ఇమేజ్‌ తగ్గలేదు. ప్రారంభ వసూళ్లు భారీగా రాబట్టే నటుడిగా ముద్ర సాధించిన అజిత్‌ ప్రస్తుతం విష్ణువర్ధన్‌ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఆర్య మరో హీరో. దీనికి 'సూరాంగణి' అని పేరు పెట్టినట్లు, అజిత్‌కు వీరాభిమాని అయిన శింబు కూడా ఇందులో కనిపించనన్నట్లు వార్తలు వినిపించాయి. అవన్నీ రూమర్స్ అజిత్‌ సన్నిహిత వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. సినిమాకి పేరు నిర్ణయించలేదని, ఇందులో శింబు లేడని ఆ వర్గాలు వెల్లడించాయి. ఆర్యకు జంటగా తాప్సి, అజిత్‌ సరసన నయనతార నటిస్తున్నారని, గౌరవపాత్రలో తెలుగు నటుడు రానా కనిపిస్తారని చెబుతున్నారు.

  ఈ గెస్ట్ రోల్ విషయమై రానా "ముంబై వచ్చాను..చాలా గ్యాప్ తర్వాత...ఇక్కడ అజిత్,విష్ణు వర్ధన్ కాంబినేషన్ లో రూపొందే చిత్రంలో ఓ గెస్ట్ రోల్ చేస్తున్నాను. అదో తమిళ చిత్రం. ముంబైలో తమిళం" అంటూ ట్వీట్ చేసారు. ఇక ప్రస్తు రానా..క్రి ష్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. కృష్ణం వందే జగద్గురం టైటిల్ తో రూపొందే ఈ చిత్రం షూటింగ్ కంటిన్యూ గా జరుగుతోంది. ఈ చిత్రంలో రానా బిటెక్ బాబుగా కనిపించనున్నాడు. ఆ పాత్ర డిఫెరెంట్ గా ఉంటుందంటున్నారు. మైనింగ్ మాపియా మీద యుద్దం ప్రకటించే కుర్రాడిగా రానా కనిపిస్తాడని, అతను ఈ చిత్రంలో నాటకాలు వేస్తాడని అంటున్నారు.

  క్రిష్ మీడియాతో రానా పాత్ర గురించి మాట్లాడుతూ..."అతని పేరు బాబు. చదివింది బీటెక్‌. అందుకే అన్నీ హైటెక్‌ తెలివి తేటలు. పుస్తకాల్లో చదివిన జ్ఞానం కంటే... జీవితాల్లోంచి గ్రహించిందే ఎక్కువ. ఎప్పటికయ్యది ప్రస్తుతం అప్పటికామాటలాడి... తప్పించుకొన్న శ్రీకృష్ణతత్వం బాగా అలవాటు చేసుకొన్నాడు. అదే అనుసరించాడు. అసలింతకీ ఈ బీటెక్‌ బాబు కథేంటో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే" అన్నారు.

  ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా రానా సరసన చేస్తోంది. నయనతార పాత్ర పేరు దేవిక. ఆమె డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. ఈ పాత్ర చిత్రంలో కీలకమై నడుస్తుంది. ఈ విషయం దర్శకుడు క్రిష్ చెపుతూ...''నా సినిమాల్లో హీరోయిన్ పాత్రకూ ప్రాముఖ్యం ఉంటుంది. 'గమ్యం'లో జానకి, 'వేదం'లో సరోజ పాత్రలు కథను ముందుండి నడిపించాయి. ఈ సినిమాలోనూ అలాంటి పాత్రే ఉంది. నయనతార దేవికగా కనిపిస్తుంది. బీటెక్‌ బాబు మాస్‌ అయితే దేవిక క్లాస్‌. డాక్యుమెంటరీలు తీస్తుంటుంది. వీరిద్దరి సంబంధం ఏమిటో తెరపై చూస్తేనే బాగుంటుంది''అన్నారు.

  English summary
  Nayantara, who is playing the lead role in Ajith movie after her return to films, played a key role in getting this offer to Rana. Earlier, Ajith has thought of roping in a senior Telugu hero for that role, but changed mind with Nayan's recommendation.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X