»   » ‘డోర’ టీజర్‌: ఆ కారులో ఆత్మ ఉంది...అది నయనతారని వెతుక్కుంటూ వచ్చింది, వివాదం

‘డోర’ టీజర్‌: ఆ కారులో ఆత్మ ఉంది...అది నయనతారని వెతుక్కుంటూ వచ్చింది, వివాదం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: హీరోయిన్ నయనతార ప్రధాన పాత్ర పోషిస్తున్న 'డోర' చిత్రం టీజర్‌ విడుదలైంది. 'ఆ కారులో ఒక ఆత్మ ఉంది.. అది ఆ పిల్ల (నయనతార)ని వెత్తుక్కుంటూ వచ్చింది. అది వచ్చిన పని పూర్తయ్యే వరకు ఆ పిల్లను వదిలి వెళ్లదు' అని సాగే టీజర్..భయపెడుతూ సాగింది. మీరూ ఈ టీజర్ ని చూసి భయపడచ్చు.

హర్రర్‌, థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ ఆసక్తి రేపుతోంది. దాదాపు నిమిషం నిడివి ఉన్న ఈ టీజర్ లో నయనతార తో పాటు కారుకు ఎక్కువే స్క్రీన్ ప్రెజన్స్ ఇవ్వటం మీరు గమనించవచ్చు. అయితే దర్శకుడు తెలివిగా కథకు సంభందించి...ఎక్కడా చిన్నపాటి క్లూ కూడా ఇవ్వకుండా భయపెట్టాడు.

దాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళ భాషలోనూ తెరకెక్కిస్తున్నారు. తెలుగులో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్‌ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెలలో పాటల్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Nayanthara's Dora official teaser released

ఇక చిత్రం విడుదల విషయానికి వస్తే.. వాస్తవానికి ఈ నెల 31వ తేదీన ఈ చిత్రం విడుదలవుతుందని అధికారికంగా ప్రకటించారు. సర్గుణం నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో తంబిరామయ్య, హారిష్‌ ఉత్తమన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్‌, మెర్విన్‌లు సంగీతాన్ని సమకూర్చారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు అమిత ఆదరణ లభించింది.

అయితే ఊిహంచని విధంగా .. తన 'అలిబాబావుం అర్పుద కారుం' కథ ఆధారంగానే 'డోరా'ను తెరకెక్కించారని ఆరోపిస్తున్నారు కొత్త దర్శకుడు శాటిలైట్‌ శ్రీధర్‌. ఈ చిత్ర విడుదలను ఆపేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించే పనిలో ఉన్నారు. ఈ చిత్రం విడుదల హక్కులను పొందిన ఆరా సినిమాస్‌ దీనిపై దిగ్భ్రాంతి చెందింది. ఏం జరుగుతోందనని చిత్ర యూనిట్ ఎదురుచూస్తోంది

దర్శకుడు మాట్లాడుతూ... ''ఈ సినిమాకు సంగీతం పెద్ద బలం. ఆ హక్కులను సోనీ సంస్థ కొనుగోలు చేసింది. డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌లోనే పాటలను విడుదల చేయనున్నారు. త్వరలోనే సింగిల్‌ట్రాక్‌ను ఆవిష్కరించన్నారు. తర్వాత మిగిలిన గీతాలను ఒక్కొక్కటిగా విడుదల అవుతాయి''ని తెలిపారు.

తెలుగులో రిలీజ్ చేస్తున్న నిర్మాత మల్కాపురం శివకుమార్ చిత్ర విశేషాలను తెలియజేస్తూ... నయనతార నటిస్తోన్న మరో మహిళా ప్రధాన చిత్రమిది. ఇప్పటి వరకు వచ్చిన హారర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఓ వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోంది.

నయనతార పాత్ర చిత్రణ కొత్త పంథాలో వుంటుంది. ప్రతి సన్నివేశం అనూహ్యమైన మలుపులతో ఉత్కంఠభరింగా సాగుతుంది. మా సంస్థలో నవ్యతతో కూడిన వినూత్న కథా చిత్రాల్ని రూపొందించాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నాను.
తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: దినేష్, సంగీతం: వివేక్, నిర్మాత: మల్కాపురం శివకుమార్.

ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: దినేష్‌, సంగీతం: వివేక్‌. 'కాష్మోర'తో గత ఏడాది అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నయనతార ప్రస్తుతం ఐదు తమిళ చిత్రాల్లో నటిస్తున్నట్లు సమాచారం.

English summary
Dora is an upcoming thriller film starring Nayanthara's telugu teaser released . However, the film has run into trouble with allegations of plagiarism, and theft of the film’s story. Sridhar, a television script writer and director, had originally written the story of a “possessed” car in 2013, and had the script’s copyright registered at the Writer’s Union then.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu