»   » నయనతార,శింబు పెళ్లి ఫోటో...కలకలం

నయనతార,శింబు పెళ్లి ఫోటో...కలకలం

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : నయనతార మెడలో శింబు కట్టిన తాళి మరోసారి కోలీవుడ్‌లో కలకలం రేపింది. గతంలో 'వల్లవన్‌' చిత్రంలో జంటగా చేరిన శింబు - నయనతార... అప్పటి నుంచి సంచలనాలకు కేంద్రంగా మారుతున్నారు. అందుకు కారణం ఆ చిత్రంలో ఇద్దరు లిప్‌లాక్‌ను అద్భుతంగా పండించటంతోపాటు నిజ జీవితంలోనూ ప్రేమికులమని చాటుకోవటమే. మనస్పర్థలతో విడిపోయి మళ్లీ 'ఇదు నమ్మఆళు'లో జోడీ కట్టారు.

ఈ నేపథ్యంలో ఇటీవల నయనతారకు శింబు తాళి కట్టే సన్నివేశాన్ని తెరకెక్కించారు దర్శకుడు పాండిరాజ్‌. ఇది సినిమా సన్నివేశమని తెలీక.. కోలీవుడ్‌తో పాటు కొన్ని వార్తాపత్రికలు కూడా దీనిపై తమదైన ఆసక్తినే ప్రదర్శించాయి. విషయం కాస్తా.. పక్కదారి పడుతోందని భావించిన దర్శకుడు పాండిరాజ్‌... ఈ పెళ్లి సినిమాలోనిది మాత్రమే అంటూ అసలు విషయం బయటపెట్టారు.

Nayanthara and Simbu's wedding scene in Pandiraj's Film

శింబు ప్రస్తుతం నయనతారతో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నారు. నయనతారతోనూ ఇదివరకు ప్రేమాయణం సాగించాడు శింబు. ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తడంతో విడిపోయారు. ఇప్పుడు మళ్లీ కలిసి నటిస్తున్నారు. ఆ విషయమే శింబు, హన్సికల మధ్య విభేదాలకు కారణమని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి.


కొద్ది రోజుల క్రితమే శింబు మీడియాతో మాట్లాడుతూ...నయనతార, నేను కలిపి పనిచేయడం ఇష్టంలేని కొందరే ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారు. మీకు చాలా స్పష్టంగా చెప్పాలంటే హన్సిక నా ప్రియురాలు. నయనతార స్నేహితురాలు అంటూ చెప్పుకొచ్చారు తమిళ హీరో శింబు. నయనతార తో కలిసి నటించటం హన్సికకు ఇష్టం లేదంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో శింబు ఖండిస్తూ ఇలా చెప్పుకొచ్చారు.

పెళ్లి గురించి మాట్లాడుతూ... ఎందుకో తెలీదు... పెళ్లంటేనే నాకు కొంచెం విరక్తి కూడా. నా దృష్టిలో పెళ్లి చేసుకోవటమంటే జైలుకెళ్లటంలాంటిదే. ప్రేమ కూడా అంతే. వివాహంతో పోలిస్తే ఇది కాస్త నయం. ప్రేమ జైలులో మన తలుపు తాళం చెవి మన వద్దే ఉంటుంది. అనుకున్నప్పుడు బయటపడొచ్చు. అదే పెళ్లే విషయంలో అలా కుదరుదు. మరెవరో మనల్ని జైలులో బంధించి.. తాళం చెవిని కూడా వారి వద్దే ఉంచుకుంటారు. ఏమైనా నా పెళ్లి 19వ ఏటనే కావాల్సింది. ఇప్పటి వరకు వాయిదాపడుతూ వస్తోందంటే నాకు తగిన అమ్మాయే భార్యగా రావాలని రాసిపెట్టి ఉందేమో అన్నారు.

English summary
Now the first look stills featuring Simbu- Nayanthara are out and one can see Nayanthara with Mangalsutra and Kungum in forehead which almost confirmed that there is a wedding scene featuring Simbu and Nayan in the film. The untitled flick has music by Kuralarasan and the film is being produced by Simbu's own production house.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu