Just In
- 48 min ago
ఈవెంట్‌కు వెళ్లి బలయ్యా.. హోటల్ గదిలో వాళ్లు నరకం చూపించారు: లక్ష్మీ రాయ్ షాకింగ్ కామెంట్స్
- 1 hr ago
బిగ్ బాస్ రహస్యాలు లీక్ చేసిన హిమజ: షోలోకి వెళ్లాలంటే దానికి ఒప్పుకోవాల్సిందేనంటూ ఘాటుగా!
- 11 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 12 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
Don't Miss!
- News
నిమ్మగడ్డ ఆగ్రహానికి గురైన ఆ ఇద్దరు ఐఎఎస్ అధికారులకు కొత్త పోస్టింగులు: కీలక స్థానాల్లో
- Finance
బడ్జెట్, ఇన్వెస్టర్ల ఆందోళన: 4 రోజుల్లో 2400 పాయింట్లు, రూ.8 లక్షల కోట్లు ఆవిరి
- Lifestyle
గురువారం దినఫలాలు : డబ్బు విషయంలో ఆశించిన ఫలితాన్ని పొందుతారు...!
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నయనతార డేటింగ్, యూఎస్‌లో ప్రియుడితో.. ఫొటోలు రచ్చ రచ్చ..

అందాల తార నయనతార మరోసారి పీకల్లోతూ ప్రేమలో మునిగితేలుతున్నది. దర్శకుడు విగ్నేష్ శివన్‌తో అతిసన్నిహితంగా ఉంటున్న ఈ సుందరి తాజాగా హాట్‌హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో అలజడి చేసింది. అమెరికాలో విగ్నేష్ కలిసి ఉన్న ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. వారి మధ్య కేవలం అఫైర్ కంటే మరేదో బంధం ఉందని ఆ ఫోటోలు సాక్ష్యంగా నిలిచాయి.

అమెరికాలో విగ్నేష్ శివన్‌తో
కెరీర్‌పరంగా నయనతార వరుస సక్సెస్‌లతో దూసుకెళ్తున్నది. అరమ్, వెలాక్కైరన్ సినిమాల విజయంతో నటిగా మరో మెట్టు ఎక్కింది. సోలో హీరోయిన్‌గా సక్సెస్‌లను సొంతం చేసుకోవడం దక్షిణాదిలో నయనతారకే చెల్లింది. విజయానందంలో ప్రస్తుతం బాయ్‌ఫ్రెండ్ విగ్నేష్ శివన్‌తో అమెరికాలో విహారయాత్ర చేస్తున్నది.

సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న విగ్నేష్
సూర్యతో తీసిన గ్యాంగ్ చిత్రం విగ్నేష్ శివన్‌కు మంచి విజయాన్ని అందించింది. ఆ చిత్రం తర్వాత సక్సెస్‌ను ఎంజాయ్ చేయడానికి ఇదే సమయం అనుకొని నయనతారతో యూఎస్ ట్రిప్ వెళ్లారు. యూఎస్ వెకేషన్‌లోని ఫొటోలను విగ్నేష్, నయనతా తమ సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేశారు.

అభిమానులకు దూరంగా
అభిమానుల తాకిడి దూరంగా అమెరికాలో నయనతార, విగ్నేష్ ఎంజాయ్ చేస్తున్నట్టు ఫోటోలలో స్పష్టమైంది. అమెరికాకు వీరు వెళ్లడం ఇదే మొదటిసారి కాదు. కొద్ది నెలల క్రితం నయన్, విగ్నేష్ ఇద్దరు కలిసి యూఎస్‌కు వెళ్లడం జరిగింది.

సహజీవనం వార్తల నడుమ
నయనతార, విగ్నేష్ సహజీవనం చేస్తున్నారనే వార్తలు కొద్ది నెలలుగా మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. అయితే వారిద్దరూ తమ రిలేషన్‌పై ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. కానీ వారి మధ్య అంతకుమించి ఏదో బంధం ఉందనేది కాదనలేని వాస్తవం అని చెప్పవచ్చంటున్నారు సినీ వర్గాలు.

సైరాకు సిద్ధమవుతున్న నయనతార
వరుస సక్సెస్‌లతో దూసుకెళున్న నయనతార ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాల షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఇటీవల ఆమె నటించిన జై సింహ చిత్రం రిలీజై మంచి సక్సెస్ సాధించింది. ప్రస్తుతం సైరా నర్సింహారెడ్డి చిత్రం కోసం సిద్ధమవుతున్నారు.

తమిళంలో బిజీ బిజీగా
తమిళంలో ఇమైక్క నోడిగల్, కొలైయుథిర్ కాలం, కొలమావు కోకిల చిత్రాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్యాంగ్ చిత్రం తర్వాత విగ్నేష్ శివన్ ఇంకా కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయలేదు.