»   »  నయనతార వైరల్ వీడియో : కమెడియన్ చేష్టలకు మీరు ఫిదా అవ్వడం ఖాయం!

నయనతార వైరల్ వీడియో : కమెడియన్ చేష్టలకు మీరు ఫిదా అవ్వడం ఖాయం!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  నయనతార వైరల్ వీడియో : కమెడియన్ చేష్టలకు మీరు ఫిదా అవ్వడం ఖాయం!

  నయనతార ప్రధాన పాత్రలో తమిళంలో తెరకెక్కుతున్న మూవీ 'కొలమావు కోకిల'. ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియో సాంగ్ ఇంటర్నెట్లో వైరల్ అయింది. సాధారణంగా నయనతార స్థాయి హీరోయిన్ ఉంటే ఆమెను ప్రేమిస్తూ వెంటపడే పాత్రలో హ్యాండ్సమ్ లుక్ ఉన్న హీరోలు కనిపిస్తారు. ఆ స్థానంలో కమెడియన్‌ను పెడితే ఆ సాంగ్ అంతగా పండక పోవచ్చు. అయితే 'కొలమావు కోకిల' మూవీలోని పాటలో నయనతార వెంటడే పాత్రలో యోగిబాబు అనే కమెడియన్‌ను పెట్టి సాంగును అద్భుతంగా చిత్రీకరించారు. ఈ పాట యూట్యూబ్‌లో వైరల్ అయింది. ప్రేక్షకుల మనసుదోచి మిలియన్ల కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంది.

  కళ్యాణ వయసు

  కళ్యాణ వయసు

  నయనతారకు లవ్ ప్రోజ్ చేస్తూ ఆమెపై ప్రేమ వ్యక్తీకరిస్తూ కమెడియన్ యోగి బాబు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నయనతార లాంటి అందగత్తెతో.... యోగిబాబు లాంటి కమెడియన్‌ను పెట్టి ప్రేక్షకులు కన్విన్స్ అయ్యేలా లవ్ సాంగ్ తీయడం అనేది అంత ఈజీ ఈ విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పక తప్పదు.

  అనిరుధ్, శివ కార్తికేయన్

  అనిరుధ్, శివ కార్తికేయన్

  ఈ పాటకు యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ వినసొంపైన ట్యూన్స్ అందించారు. తమిళ హీరో శివకార్తికేయన్ లిరిక్స్ సమకూర్చారు. ‘కొలమావు కోకిల' మూవీకి నిర్మాత కూడా శివకార్తికేయనే. అతడు నిర్మిస్తున్న తొలి చిత్రం ఇది.

   నవ్వు తెప్పించే యోగిబాబు డాన్స్

  నవ్వు తెప్పించే యోగిబాబు డాన్స్

  ఈ సాంగ్ ఇంత హిట్టవడానికి అనిరుధ్ అందించిన ట్యూన్స్ ఓ కారణమైతే.... యోగి బాబు వేసే స్టెప్పులు, హిల్లేరిస్ పెర్ఫార్మెన్స్, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను తెగనవ్విస్తాయి. ముఖ్యంగా క్రికెట్ ఆడుతూ ఎంఎస్ ధోనీలా హెలికాప్టర్ షాట్స్ కొడుతూ అతడు ప్రదర్శించే హావభావాలు ప్రేక్షకులను బాగా ఎంటర్టెన్ చేస్తోంది.

  పాపులర్ కమెడియన్ సెంథిల్ స్థాయిలో

  ఒకప్పుడు కమెడియన్ సెంథిల్ తమిళ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపాడు. ఈ సాంగ్ చూసిన తర్వాత చాలా మంది కోలీవుడ్లో నెక్ట్స్ సెంథిల్ ... యోగిబాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘కొలమావు కోకిల' చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

  English summary
  Yogi Babu is winning fans over in the newly-released song from the Nayanthara-starrer Kolamaavu Kokila.A song titled Kalyaana Vayasu was released on Thursday, May 17, in which Yogi Babu is trying to win over a girl, played by Nayan, to fall in love with him. The hype around the track doubled after Nayanthara's beau Vignesh Shivan commented that he was ready for marriage. Kolamavu Kokila, bankrolled by Lyca Productions, is directed by Nelson Dilipkumar.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more