»   » నిర్మాతల మాట నమ్మి మోసం...నటి అరెస్టు

నిర్మాతల మాట నమ్మి మోసం...నటి అరెస్టు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: అమెరికా వీసాను పొందడం కోసం నకిలీ దస్తావేజులు సమర్పించిన ఓ కేరళ నటిని రాయపేట పోలీసులు అరెస్టు చేశారు. కేరళలోని పత్తినంతిట్టకు చెందిన 28 ఏళ్ల నీతూకృష్ణ (సెలబ్రేషన్స్ 2014) పలు మలయాళ చిత్రాల్లో నటించారు. అమెరికా వీసా కోసం ఆమె చెన్నైలోని అమెరికా రాయబార కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఆ పత్రాలను పరిశీలించడం కోసం నీతూకృష్ణను అధికారులు పిలిపించారు. పరిశీలన సమయంలో ఆమె సమర్పించిన పత్రాలు నకిలీవని తేలడంతో అధికారులు రాయపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రాయపేట పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ సత్యశీలన్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేంద్రన్‌లు అక్కడకు వెళ్ళి నీతూకృష్ణను అరెస్టు చేశారు.

Neethu Krishna Vasu arrested for submitting forged documents to get US visa

పోలీసులు జరిపిన విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. మలయాళ చిత్ర నటి అయిన ఆమె డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌ల ద్వారా బాగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో అమెరికా బయలుదేరినట్టు తెలిసింది. సినీ నిర్మాత అయిన రాజు అనే వ్యక్తి చెప్పిన మాటలు నమ్మి ఆమె నకిలీ వీసా కోసం రూ.రెండు లక్షలు ఇచ్చారని వెల్లడైంది.

ఆమెతో పాటు ఆ వ్యవహారంలో పాలుపంచుకున్న సెబాస్టియన్‌ను కూడా అరెస్టు చేసిన పోలీసులు రాజు, కుంజుమోన్‌లకోసం గాలిస్తున్నారు. కాగా, తంజావూరుకు చెందిన జాఫర్‌ అలీ అనే వ్యక్తిని కూడా ఇదే తరహా కేసుకు సంబంధించి అరెస్టు చేశామని పోలీసు వర్గాలు తెలిపాయి.

English summary
The Chennai police have arrested a Malayalam actress Neethu Krishna Vasu (27), and two others for producing forged documents to get US visa.
Please Wait while comments are loading...