ప్రముఖ నటుడు మృతి.. నటి సంతాప సందేశం మీద దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు!
కరోనా మహమ్మారి కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండో దశలో చాలా మంది సినీ సెలబ్రిటీలు అలాగే సినీ సెలబ్రిటీలకు చెందిన ఆప్తులు కూడా కన్ను మూస్తున్నారు. ఈరోజు టాలీవుడ్ కి చెందిన ఒక టీవీ సీరియల్ నిర్మాత మరణించగా తమిళ్ టీవీ సీరియల్ నిర్మాత కూడా నిన్న మరణించారు. అదే విధంగా తమిళ నటుడు నిర్మాత వెంకట్ శుభ కూడా కరోనా కారణంగా కన్నుమూశారు.. ఫిలిం జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఆయన అనేక అవాంతరాలను ఎదుర్కొని నటుడిగా మారి తర్వాత నిర్మాత స్థాయికి ఎదిగారు..
వారం రోజుల క్రితం క్రితం కరోనా బారిన పడిన ఆయన కరోనా కి చికిత్స పొందుతూ మే 29 తెల్లవారుజామున మృతి చెందారు.. ఆయన మృతికి పలువురు తమిళ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. నటుడు ప్రకాష్ రాజ్, నటి రాధిక శరత్ కుమార్ తో పాటు తమిళ నటి కస్తూరి శంకర్ సైతం సోషల్ మీడియా వేదికగా ఆయనకు సంతాపం వ్యక్తం చేశారు.. అయితే కస్తూరి శంకర్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి.

'వెంకట్ సర్ ఇది నమ్మశక్యంగా లేదు.. ఉదయనిధి సినిమా షూటింగ్ నుంచి వచ్చారు.. ఆ మరుసటి రోజే జ్వరం వచ్చింది.. కానీ పాజిటివ్ రాలేదు.. ఆ తరువాత కొన్ని రోజులకు మళ్లీ అనారోగ్యం పాలయ్యారు.. ఇప్పుడు ఆయన మరణించారు.. ఆయనింకా వ్యాక్సిన్ కూడా వేసుకో లేదనుకుంటా. సారీ సుభా' అంటూ కస్తూరీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రచ్చ రేపుతున్నాయి. ఇదంతా డీఎంకే నేత ఉదయనిధి వల్ల అయిందంటావా? వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్లే మరణించారంటావా? అసలు ఏ ఉద్దేశంతో అలా కామెంట్ చేశారు అంటూ అని ఆమెను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అంతే కాక మనిషి పోతే బాధ పడాల్సింది పోయి ఈ కామెంట్ ఏమిటి అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు..


Click it and Unblock the Notifications











