»   » రజనీకాంత్ ఓ జోకర్.. అంటూ వివాదం

రజనీకాంత్ ఓ జోకర్.. అంటూ వివాదం

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ జోకరంటూ స్టంట్ మాస్టర్ జాగువార్ తంగం చేసిన వ్యాఖ్యలు తమిళ సినీ పరిశ్రమలో సరికొత్త సమస్యను సృష్టించేలా కనిపిస్తున్నాయి. రజనీ తమిళనాడులో వున్నంత సేపు తమిళులకు మద్దతుగా మాట్లాడుతారని, కర్ణాటకకు వెళ్ళితే కన్నడిగులపై ప్రేమను ఒలకబోస్తారని విమర్శించారు.సమయాన్ని బట్టి ఇరు రాష్ట్రాల ప్రజల వద్ద క్షమాపణలు కోరతారని, రాజకీయాలతో సంబంధం లేదంటూనే హఠాత్తుగా అన్నాడీఎంకేకు మద్దతుగా ఓటు వేయాలని చెబుతుంటారని, అందువల్ల రజనీ అభిప్రాయాలను పట్టించుకోవలసిన అవసరం లేదని తగం మీడియా సమావేశం నిర్వహించి చెప్పుకొచ్చారు.

తంగం వ్యాఖ్యలకు ఆగ్రహం చెందిన రజనీ అభిమానులు ఎంజీఆర్ నగర్‌లోని జాగువర్ తంగం ఇంటిపై దాడి చేశారు. ఇందుకు ప్రతిగా తంగం మద్దతుదారులు కోడంబాక్కంలోని రజనీకాంత్ కళ్యాణమండపాన్ని ధ్వం సం చేశారు. జాగువర్ తంగం ఇంటి వద్ద పోలీసులు కాపలా వుండగానే ఈ దాడి జరిగింది. ఇందులో జాగువర్ తంగం సతీమణి శాంతి స్వల్పంగా గా యపడ్డారు. ఈ వ్యవహారం సినీ పరిశ్రమలో చీలికలు ఏర్పడడానికి కారణమవుతుందేమోనని సీనియర్ కళాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu